Banjara Hills CI: తెలంగాణలో యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి చుట్టూ మళ్లీ వివాదం రాజుకుంది. తన ఫోన్‌తోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ అగ్ర నాయకుల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే బంజారాహిల్స్‌ సీఐ పారిపోతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే వస్తుంటే చూసి కూడా వెళ్లిపోతుండడంపై మండిపడ్డారు. వాహనంలో వెళ్తుండగా సీఐను ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐతో వాగ్వాదానికి దిగడం సంచలనంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao: 'నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా రేవంత్‌ రెడ్డి నిన్ను వదల?


హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఏసీపీ అపాయింట్‌మెంట్‌ తీసుకుని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి గురువారం మధ్యాహ్నం పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్నారు. పార్టీ ప్రతినిధులతో స్టేషన్‌లోకి వచ్చినా కూడా సీఐ వెళ్లిపోతుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కారులో కూర్చున్న సీఐతో వాగ్వాదానికి దిగారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల నిరసనతో కారు దిగి సీఐ తన చాంబర్‌లోకి వెళ్లారు. అక్కడ సీఐ, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది.

Also Read: Revanth Reddy: 'మూసీ'లో కిషన్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నా సరే ప్రక్షాళన చేస్తా


'డీజీపీ కన్నా ఎక్కువ ప్రోట్‌కాల్ ఎమ్మెల్యేకు ఉంటుందని తెలియదా? ఏసీపీకి ఫోన్‌ చేసి అపాయింట్‌మెంట్‌ తీసుకుని వచ్చాం. మేం వచ్చేముందు ఏసీపీ వెళ్లిపోయాడు. ఇప్పుడు సీఐ వెళ్తున్నారు. ఇదేమిటి' అని ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి నిలదీశారు. పోలీస్‌ స్టేషన్‌ నిబంధనలు వివరించడంతో వెనక్కి తగ్గిన సీఐ బీఆర్‌ఎస్‌ పార్టీ బృందంతో చర్చించారు. అనంతరం సీఐకు ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి, పార్టీ బృందం ఫిర్యాదును అందించారు. సీఐకి ఫిర్యాదు అందించిన అనంతరం రసీదు పొందారు. పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన వివాదం బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లిందని తెలుస్తోంది. అక్కడ జరిగిన వ్యవహారం మొత్తం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు వివరించినట్లు సమాచారం. కాగా పోలీస్‌ స్టేషన్‌లో విధులకు ఆటంకం కలిగించారని పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై ఉన్నత అధికారుల ఆదేశం మేరకు ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డితోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.