cp cv anand issues key instructions to ram navami shobha yatra: శ్రీరామ నవమి ఉత్సవాలను దేశ మంతట పండుగల నిర్వహించుకుంటారు. ఈ క్రమంలో ఈసారి శ్రీరామనవమిని ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు జరుపుకోబోతున్నాం. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్సవకమిటీ నిర్వహకులతో సమావేశం అయ్యారు. నగరంలో రాముడి శోభయాత్రలో నిర్వాహకులు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని చెప్పారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రతిఏడాది హైదరబాద్ లో వైభవంగా రాముడిశోభాయాత్రను నిర్వహిస్తారు.ఈ సారి కూడా శోభయాత్రను నిర్వహించేందుకు సన్నాహలు ప్రారంభించారు.
శ్రీరామనవమి సందర్భంగా 6వ తేదీన నిర్వహించే శోభాయాత్రను శాంతియుతంగా, ఉల్లాసంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. శోభాయాత్ర.. తారాం భాగ్ నుంచి ప్రారంభం అవుతుందని అన్నారు. అదే విధంగా.. మధ్యాహ్నం ఒంటి గంటలోపు శోభాయాత్ర ప్రారంభం అయ్యేలా నిర్వహకులు చూసుకొవాలన్నారు. అదే విధంగా పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా.. కాస్త చిన్నగా ఉండేలాచూసుకొవాలన్నారు. విగ్రహాలను వాహనంలో ఎక్కించే ముందు వాటిపై ఒక సారి ట్రయాల్స్ వేయాలన్నారు.
నిర్వాహకులు ఎవరైన డ్రోన్స్ ఎగుర వేయాలి అంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. శోభాయాత్రలో డీజే సౌండ్‌లు అతిగా ఉండకుండాచూసుకొవాలన్నారు. అదే విధంగా ఒక వర్గాన్ని లేదా ఇతరులను కించ పరిచే విధంగా పాటలు కానీ.. పనులు కానీ చేయోద్దని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
శోభాయాత్ర నడిచే మార్గంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా.. పోలీసులు గట్టి బందో బస్తు ఏర్పాటు చేస్తారన్నారు. హైదరాబాద్ లోని అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుని శ్రీరామ నవమిశోభయాత్ర విజయవంతగా అయ్యేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని సీపీ సీవీఆనంద్ స్పష్టం చేశారు. అదే విధంగా రెచ్చకొట్టే వ్యాఖ్యలు, గొడవలు చెలరేగేలా ఎవరు కూడా ప్రవర్తించకూడదన్నారు. ఎవరైన అనుమానస్పద వ్యక్తులు కన్పించిన, వస్తువులు ఉన్న వెంటనే తమకు తెలియజేయాలన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









