Hyderabad:ఘోరం.. 6 నెలలుగా ఉద్యోగం లేక పిల్లల్ని చంపి భార్యతోపాటు ఆత్మహత్యకు పాల్పడిన లెక్చరర్‌..

Hyderabad Family Suicide: హైదరాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఆరు నెలలుగా ఉద్యోగం లేక పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడిన లెక్చర్ దంపతులు. మంగళవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ హబ్సిగూడలో ఈ ఘోరం చోటు చేసుకుంది. 6 నెలలుగా ఉద్యోగం లేని లెక్చరర్ ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు పిల్లల్ని చంపి భార్యతో పాటు బలన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదం ఒక్కసారిగా హైదరాబాద్ ఉలిక్కిపడేలా చేసింది. పూర్తి వివరాలు ఇవే

Written by - Renuka Godugu | Last Updated : Mar 11, 2025, 07:43 AM IST
Hyderabad:ఘోరం.. 6 నెలలుగా ఉద్యోగం లేక పిల్లల్ని చంపి భార్యతోపాటు ఆత్మహత్యకు పాల్పడిన లెక్చరర్‌..

Hyderabad Family Suicide: హైదరాబాద్ హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు చంద్రశేఖర్ (40) కవిత (35) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు ప్రధాన కారణం అప్పులు ముఖ్యంగా ఆరు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో లెక్చరర్ గా పని చేసిన చంద్రశేఖర్ ఈ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రధానంగా వీరు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ఆరు నెలల కిందట లెక్చరర్ గా పని చేసిన చంద్రశేఖర్ కొన్ని కారణాలవల్ల ఉద్యోగాన్ని మానేశాడు. ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పనిచేశాడు. జాబ్ లేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గత నెల 21వ తేదీనే చనిపోదాం అనుకున్నారు. ఇక భార్య కవితను కూడా ఈ ఆత్మహత్యకు ఒప్పించాడు. ఈ విషయాన్ని చంద్రశేఖర్ సూసైడ్ నోట్లో రాశారు.  హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఈ సూసైడ్ ఘటన చోటుచేసుకుంది. కాగా, చంద్రశేఖర్ నాగర్ కర్నూల్ వాసిగా గుర్తించారు. వీరి పిల్లలు శ్రితారెడ్డి (13) విశ్వాన్‌ రెడ్డి (10) చంపి ఆ తర్వాత చెరో గదిలో ఉరేసుకొని చనిపోయారు.

హైదరాబాద్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుటుంబం ఆత్మహత్య అందరినీ కలచివేసింది. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు కొన్ని నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన చంద్రశేఖరరెడ్డి ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నారు. భార్యను కూడా ఒప్పించి ముందుగా కూతురుకి ఉరివేసి చంపి ఆ తర్వాత కొడుకుకు విషం ఇచ్చి చంపారు. అయితే కవిత గృహిణి కూతురు 9వ తరగతి చదువుతోంది. ఇక కుమారుడు విశ్వాన్ ఐదో తరగతి చదువుతున్నారు. ఏడాదిగా హబ్సిగూడ ప్రాంతంలో వీరు నివాసం ఉంటున్నారు.

Also Read:తిరుమల టిక్కెట్లు బుక్‌ చేసుకునేవారికి బిగ్ అలర్ట్ .. దర్శనం టికెట్లు ఈ వెబ్సైట్‌లోనే బుక్ చేసుకోండి: టీటీడీ  

ప్రధానంగా తన చావుకు ఎవరూ కారణం కాదని.. అప్పులు ఎక్కువ అవ్వడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు చంద్రశేఖర్ సూసైడ్ నోట్లో రాశాడు. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు వివరించారు. ముఖ్యంగా చంద్రశేఖర్ మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు కూడా వివరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మొత్తానికి వీలు 20 రోజులుగా ఆత్మహత్య పాల్పడడానికి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన భార్య కవితను కూడా ఒప్పించి ఈ ఘోరానికి పాల్పడ్డారు. మొత్తానికి ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు అభం శుభం తెలియని రెండు పసిప్రాణాలను కూడా బలిగొన్నాయి.

Also Read: మార్చి 11 రాశిఫలాలు.. ఈరోజు ఆ రాశి కింగ్‌ వీరికి అడ్డే లేదు..!  
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News