)
Hyderabad Heavy Rains 3 Days: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ ఈ మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ హైడ్రా అధికారులు హెచ్చరించారు. మేడ్చల్ సైబరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా ఆగస్టు 13, 14, 15 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాల వాడకం కూడా తగ్గించాలని సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని సూచించారు. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం కూడా కల్పించాలని సాఫ్ట్వేర్ ఆఫీసులకు కూడా సూచించారు. అయితే ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా కోరారు.
రాత్రంతా వర్షం కురిసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, యాదాద్రి, రంగారెడ్డి, పెద్దపల్లి, భూపాల పల్లి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని గంటల్లో సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, ములుగు, సూర్యాపేట, నాగర్ కర్నూల్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు, హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచే వర్షం కురవడంతో హెచ్చరికలు జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి అవి తీవ్ర రూపం దాల్చి అవకాశం ఉంది. మూడు రోజులపాటు తగిన భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు ముందస్తు చర్యలో నిమగ్నం కూడా అయ్యారు. ఇక రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక అత్యవసర సమయంలో హెల్ప్ లైన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. 04029560521, 9000113667, 9154170992 నంబర్లకు కాల్ చేయాలనీ సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు హైడ్రాతో పాటు పోలీసులు కూడా సూచించారు. ప్రధానంగా 15వ తేదీ వరకు భారీ వర్ష సూచన ఉంది. సాయంత్రం వేళలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అత్యవసరం ఉంటేనే బయటకు రావాలి .వెదర్ అప్డేట్స్ కూడా ఫాలో అవుతూ ఉండాలని సూచించారు. ఇక మీ వాహనాల కండిషన్ కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా వర్షంలో చెట్ల కింద, కరెంటు పోల్స్ దగ్గర నిలబడకుండా ఉండాలని సూచించారు. జాగ్రత్తలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరండి అని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
⚠️ Hyderabad Weather Alert ⚠️
Heavy rains are expected over the next 4 days! ?️⛈️
Plan your travel wisely and avoid unnecessary trips to stay safe. ??HYDRAA - DRF Helpline : 040 29560521 | 9000113667 | 9154170992#HyderabadRains #HYDRAA pic.twitter.com/xCvAcTqohP
— HYDRAA (@Comm_HYDRAA) August 12, 2025
5 రోజులు స్కూళ్లకు సెలవులు..
ఇక ఇప్పటికే జిల్లాలో స్కూళ్లకు 5 రోజులు సెలవులు ప్రకటించారు. భారీ వర్షం సూచన నేపథ్యంలో హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాలో స్కూళ్లకు ఇవ్వాళా, రేపు సెలవులు ప్రకటించారు. దీంతో ఈ జిల్లాల్లో 15 స్వాతంత్ర దినోత్సవం, 16న కృష్ణాష్టమి, 17న ఆదివారం కావడంతో ఈరోజు నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఇంకా జిహెచ్ఎంసి ఏరియాలో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇళ్లకు చేరే సమయంలో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు నడపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక హైదరాబాదులో అర్ధరాత్రి రెండు గంటల నుంచి వాన కురుస్తూ ఉంది ఇప్పటికే ఆకాశం కూడా మేఘావృతం అయిపోయింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి