Hyderabad Metro: హైదరాబాద్‌ ప్రయాణీకులకు బిగ్‌ షాక్‌.. ఛార్జీల పెంపు తథ్యమంటున్న మెట్రో..

Hyderabad Metro Charges Hike: హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు బిగ్‌ షాక్‌ అని చెప్పాలి. మెట్రో ప్రయాణ ఛార్జీలను పెంపు తథ్యమని తెలుస్తోంది. ప్రధానంగా నష్టాలు పెరగడంతో ఈ మెట్రో ఛార్జీలు పెంపునకు సిద్ధపడుతోంది హైదరాబాద్ మెట్రో.

Written by - Renuka Godugu | Last Updated : Apr 17, 2025, 09:47 AM IST
Hyderabad Metro: హైదరాబాద్‌ ప్రయాణీకులకు బిగ్‌ షాక్‌.. ఛార్జీల పెంపు తథ్యమంటున్న మెట్రో..

Hyderabad Metro Charges Hike: హైదరాబాదులో ఉంటూ మెట్రో ప్రయాణం చేస్తున్న వారికి బిగ్‌ షాక్‌ అని చెప్పాలి. మెట్రో ఛార్జీలు పెంపకం తథ్యమని తెలుస్తోంది. అతి త్వరలోనే మెట్రో ధరలో పెంపునకు సిద్ధమవుతోంది హైదరాబాద్ మెట్రో. దాదాపు 50 శాతం పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.60 వరకు పెంచే యోచనలో ఉంది. అది ఎప్పుడు అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

Add Zee News as a Preferred Source

ఇప్పటికే మెట్రో రూ.59 హాలిడే సేవర్ కార్డును కూడా రద్దు చేసింది.  రద్దీ ఎక్కువైన సమయంలో 10% రాయితీని కూడా ఎత్తివేసింది. మెట్రో  ధరల సవరణకు 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఎల్ అండ్ టి. అయితే అప్పట్లో కేసీఆర్ సర్కార్ ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ని కోరారు .

కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ప్రయాణికుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతనే సిఫార్సు చేయాలని సమర్పించింది. ఆ తర్వాత ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో వాయిదా పడింది. అయితే ఏటా మెట్రో ఛార్జీల నష్టాలు పెరగడంతో ఇటీవలే బెంగళూరు మెట్రో ఛార్జీలు కూడా 44 శాతం పెరిగాయి హైదరాబాద్ మెట్రో సైతం చార్జీలకు పెంపునకు సిద్ధమైంది .

2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రజలకు సేవలు అందిస్తూ వస్తుంది. అయితే రూ.6500 కోట్లకు మెట్రో రైల్ నష్టాలు చేరాయి అని ఎల్ అండ్ టీ సంస్థ చెబుతోంది. ఇప్పటికే ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే నష్టాలు తారస్థాయికి చేరడంతో భరించలేక ఛార్జీలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు కూడా ప్రయాణికులకు సరిపోవడం లేదు. కొత్త వాటిని కొనుగోళ్లకు చేయడానికి కూడా మెట్రో ప్రయత్నిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కోచ్లను కొనుగోలు చేయాలని దానికి ఈ చార్జీలు పెంపక తప్పడం లేదు. అయితే హైదరాబాద్ మెట్రోలో మాత్రం 50% మేరకు ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: స్కూళ్లకు సెలవులు.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..

ఇదీ చదవండి: ఐపీఎల్ వేళ జియో బంపర్ ప్లాన్.. 50 రోజుల వైఫై ఫ్రీ, మూడు నెలల హాట్ స్టార్ స్ట్రీమింగ్..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News