HMRL Suvaran Package | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. మెట్రో జర్నీ చేసే వారికి 50 శాతం రాయితీ ( రూ.600 వరకు) కల్పించనున్నారు. మెట్రో కార్డుపై రీచార్జ్   చేసే వారు ఆదివారం నుంచే ఈ రాయితీని పొందవచ్చు అని హైదరాబాద్ మెట్రో ( Hyderabad Metro ) రైల్ డైరక్టర్ ఎన్వీఎస్ రెడ్డి శనివారం ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Rythu Vedika: రైతు వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్


మెట్రో స్టేషన్ లేదా అన్‌లైన్‌లో రీచార్జ్ చేసుకునే వారికి క్యాష్ బ్యాక్ రీఫండ్ అవుతుంది అని...దీనికి 90 రోజుల పాటు వాలిడిటీ ఉంటుంది అని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి. ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా మెట్రో ప్రయాణానికి సుముఖత చూపుతున్నారు అని తెలిపారు. ప్రతీ రోజు లక్షా 30 వేల మంది మెట్రోలో ప్రయాణిస్తారని వెల్లడించారు. దీంతో పాటు ప్రయాణికుల కోసం త్వరలో సువర్ణ ప్యాకేజీని ( HMRL Suvaran Package) ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో 30 శాతం అధికంగా మెట్రో ప్రయాణికులు పెరిగారని అన్నారు.



Also Read:  AP Ration Cards: 35 రోజుల్లోనే 6 లక్షల రేషన్ కార్డులు జారీ చేసి ఏపి ప్రభుత్వం


ప్రయాణికులు ఎంచుకున్న డిస్కౌంట్ ఆప్షన్ ప్రకారం అక్టోబర్ 17వ తేదీ నుంచి మెట్రో సువర్ణ ప్యాకేజీని హైదరాబాద్ ( Hyderabad ) మెట్రో రైల్ ప్రకటించింది. ఇందులో ప్రయాణికులు 40 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 17వ తేదీ నుంచి సంక్రాంతి వరకు కొనసాగుతుంది.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR