Hyderabad: ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం... బాధితురాలిని యశోద ఆస్పత్రికి తరలింపు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

Rape attempt on woman in mmts: ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచారయత్నం బాధితురాలని ప్రస్తుతం సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 24, 2025, 10:49 PM IST
  • యువతిపై అత్యాచార ఘటన..
  • యశోదకు బాధితురాలి తరలింపు
Hyderabad: ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం... బాధితురాలిని యశోద ఆస్పత్రికి తరలింపు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

Hyderabad mmts train rape incident: ఎంఎంటీఎస్ రైల్లో మహిళపై అత్యాచార యత్నం ఘటన హైదరబాద్ లో సంచలనంగా మారింది. దీనిపై అన్ని పార్టీలు కూడా సీరియస్ గా స్పందించాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు ఆస్పత్రికి వెళ్లి మరీ బాధితురాలిని పరామర్శించారు.ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత.. రైల్వే ఎస్పీ చందనాదీప్తితో సైతం మాట్లాడారు. ఘటనపై వెంటనే లోతుగా విచారణ చేపట్టాలన్నారు.

Add Zee News as a Preferred Source

నిందితుడ్ని వీలైనంత తొందరగా పట్టుకుని కఠినంగా పనిష్మెంట్ పడేలా చూడాలన్నారు. తాజాగా.. బాధిత మహిళ ఘటనపై కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేంద్ర మంత్రి ఆదేశాల  మేరకు.. బీజేపీ నేతలు.. సదరు బాధితురాలిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర మంత్రి వైద్యుల్ని కోరారు. మహిళ కోలుకునే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.  

ఈ ఘటనపై ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం స్పందించక పోవడం షాకింగ్ కు గురిచేస్తుదన్నారు. ఒక ఆడపిల్లకు ఇంత అన్యాయం జరిగిన రేవంత్ సర్కారు కనీసం ఖండిచడంలేదన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో.. ఈ ఘటనలు చూస్తే అర్థమౌతుందన్నారు. అంతేకాకుండా.. తెలంగాణలో హోంశాఖ లేకపోవడం కూడా ఇక్కడ నేరాలు పెరగటానికి ఒక కారణమన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరక్కుండా.. తెలంగాణ ప్రభుత్వం, రైల్వేడిపార్ట్ మెంట్ కఠినంగా చర్యలు తీసుకొవాలని డిమాండ్  చేశాడు.

అనంతపురంకు చెందిన యుతివతి మేడ్చల్ లో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. సికింద్రాబాద్ లో ఒక పనికోసం వచ్చింది. ఆతర్వాత మరల మేడ్చల్ వెళ్లేందుకు ట్రైన్ ఎక్కింది. అల్వాల్ లో ఇద్దరు మహిళలు దిగిపోయారు. అప్పటికే భోగీలో ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు.

Read more: Hyderabad: ఎంఎంటిఎస్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారయత్నం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారంటే..?

అతను కోంపల్లిరాగానే.. యువతి దగ్గరకు వెళ్లి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. వెంటనే సదరు మహిళ ప్రతిఘటించి.. ట్రైన్ లో నుంచి కిందకు దూకేసింది. వెంటనే రోడ్డు మీద ఉన్న ప్రయాణికులు యువతిని గమనించి ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జీఆర్పీ పోలీసులు విచారణ చేపట్టారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News