Hyderabad MMTS Train Rape Incident: భాగ్య నగరంలో వరుస దారుణాలు జరగుతున్నాయి. తాజాగా మరో దారుణం హైదరాబాద్ ఎంఎంటీస్ రైలు వేదికగా జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం చేశాడు ఓ యువకుడు. అతడి నుంచి తప్పించుకునేందుకు యువతి కదులుతున్న ట్రైన్ నుంచి దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలికి గాంధీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా గుండ్ల పోచంపల్లి సమీపంలో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు యువకుడు. బోగీలో యువతి ఒక్కరే ఉండటంతో అత్యాచారయత్నానికి దుండగుడు పాల్పడ్డాడు. మేడ్చల్ కు చెందిన యువతి పోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.
తిరిగి ఇంటికి వెళుతుండగా రాత్రి 8 గంటల సమయంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. కదులుతున్న MMTS రైలులో అత్యాచారయత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. అంతేకాదు నిందితుడికి పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. మహిళలకు సంబంధించిన భోగీలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ విధులు నిర్వహించాల్సిన వారు.. ఎందుకు లేరు అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనిపై రైల్వే శాఖ సమగ్ర విచారణకు ఆదేశిస్తుందా లేదా అనేది చూడాలి. మొత్తంగా బాధితురాలు కదులుతున్న రైలు నుంచి దూకేయడం వల్ల ఆమెకు తీవ్ర గాయాలపాలైంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేసారు పోలీసులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.