Rohingya muslims in Hyderbad: హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాల రాజ్యం.. బర్మా టూ భాగ్యనగరం..

Rohingya muslims in Hyderbad: ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశంలో ఉంటున్న పాకిస్థాన్ పౌరులు వాళ్ల దేశానికి వెళ్లిపోవాలని మన దేశం అల్టీమేటం జారీ చేసింది. ఇందులో భాగంగా చాలా మందిని పాకిస్థాన్ కు పంపేసింది. కానీ బర్మా ఇప్పటి మ్యాన్ మార్ నుంచి పారిపోయి వచ్చిన రోహింగ్యాలు ఇప్పటికే హైదరాబాద్ పాతబస్తీలో తిష్టవేసిన విషయాన్ని జీ న్యూస్ బయటపెట్టింది.   

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 17, 2025, 10:57 AM IST
Rohingya muslims in Hyderbad: హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాల రాజ్యం.. బర్మా టూ భాగ్యనగరం..

Rohingya muslims in Hyderbad:  హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఆపరేషన్‌లో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చెబుతున్నట్టుగానే పాతబస్తీలో భారీగా రోహింగ్యాలు నివాసం ఉంటున్నట్లు జీ న్యూస్ చేపట్టిన ఆపరేషన్ లో  తేలింది. కేవలం మ్యాన్ మార్ (బర్మా), బంగ్లాదేశ్ నుంచి  హైదరాబాద్ కు వారు వలస వచ్చినట్లు తేలింది. 
స్థానికంగా 12 వందల  కుటుంబాలు ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

Add Zee News as a Preferred Source

అయితే అనధికారంగా వారి సంఖ్య 40 వేల కు పైగానే ఉంటుందని తెలుస్తోంది. వారిలో కొంత మందికి UNCHR అధికారికంగా శరణార్థి సర్టిఫికెట్ల జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని వెనక అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే, ఎంపీ మద్దతు ఉందనేది బహిరంగ సత్యం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు పాతబస్తీకి చెందిన ఎంఐఎం పార్టీ కి తలొగ్గి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మన రాష్ట్రంలో అక్రమంగా వలన ఉంటున్న రోహింగ్యాల విషయంలో చూసీచూడనట్టు వ్యవహరించిందనేది బీజేపీ నేతలు చెబుతున్న మాట.

ముఖ్యంగా పాతబస్తీలోని చాంద్రాయణ గుట్ట,  బాలాపూర్, ఆషామాబాద్, కాలా పత్తర్, ఫలక్ నుమా, బార్కాస్, షాహిన్ నగర్ వంటి ప్రాంతాల్లో వీళ్లు ప్రముఖంగా ఉన్నారు. ముఖ్యంగా మన దేశానికి చెందిన వారైతే ఎక్కువ డబ్బులకు పనిచేస్తారు. వీళ్లు మాత్రం ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అది అక్కడ ముస్లిమ్స్ కు వరంగా మారింది. కొంత మంది సంపన్న ముస్లిమ్స్ తక్కువ జీతానికి వస్తున్నారని వీరిని తమ దగ్గర పనిలో పెట్టుకున్నారు. ఇలా పనిచేస్తున్న వారిలో స్లీపర్స్ సెల్స్ కూడా  ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలో రేవంత్ రెడ్డి సర్కారు.. ఓటు బ్యాంక్ కోసం ఎంఐఎం చెప్పినట్టే నడుచుకుంటుందని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. వారి చెబుతున్నది నిజమనే విషయం జీ తెలుగు న్యూస్ ఆపరేషన్ లో బయటపడింది.

ముఖ్యంగా ఈ రోహింగ్యాలు బర్మా దేశంలో వాళ్లు చేస్తోన్న అరాచకాలు భరించేలేక అక్కడునున్న బుద్ధిస్టులు వారిని తన్ని తరిమేసారు. వీరు మన దేశంలో పశ్చిమ బంగాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల గుండా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ కొంత మంది దేశ ద్రోహుల కారణంగా ఇక్కడి ఆధార్, ఓటర్ కార్డులను పొందుతున్నారు. ఇక అస్సామ్ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, పశ్చిమ బంకలోని మమతా బెనర్జీ వీళ్లు రోహింగ్యాలని తెలిసినా.. తమ పార్టీకి ఓటు వేస్తారనే ఉద్దేశ్యంతో వారిని చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.వీరు మెల్లగా మెజారిటీ ప్రాంతాలైన హిందువులు ఉండే ప్రాంతాల్లో వచ్చి అన్ని రకాల వ్యాపారాలను చేజిక్కించుకుంటున్నారు. మొత్తంగా కొన్ని పార్టీల నిర్వాకం వల్ల వీరిని గుర్తించడం కష్టమవుతుంది. అందుకే భారత ప్రభుత్వం అక్రమంగా భారత్ లో స్థిర నివాసం ఉంటున్న వారిపై కఠినంగా వ్యవహరించడంతో వారి దేశాలకు డిపోర్ట్ చేసే పనిలో పడింది. మరి హైదరాబాద్ లో అక్రమంగా రాజ్యమేలుతున్న రోహింగ్యాలను ఏ రకంగా వాళ్ల దేశానికి డిపోర్ట్ చేస్తారన్నది చూడాలి. 

Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..

Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News