Telangana govt key decision on permits 65000 new electric auto rickshaw: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన టార్గెట్ గా .. ట్రాన్స్ పొర్ట్ డిపార్ట్ మెంట్ తీసుకున్న నిర్ణయంతో ఆటోవాలాలు పండగ చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని .. రేవంత్ ప్రభుత్వం 65 వేల కొత్త త్రి వీలర్ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ జీవో 263 ను జారీ చేసింది. ఈ మేరకు దీనిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపారు. హైదరాబాద్ నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది. కొత్త ఆటో రిక్షాలు నడిపేందుకు గత కొంత కాలంగా పర్మిట్లు ఇవ్వలేదు.
తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం జీవో 263 జారీ చేసింది. ముఖ్యంగా కాలుష్యాన్ని తగ్గించడమే టార్గెట్ గా పెట్రోల్, డీజీల్ లేని ఆటోలకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈక్రమంలో.. అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో కొత్తగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటో రిక్షా లకు అనుమతినిచ్చారు. దీనితో పాటు.. 10 వేల కొత్త ఎల్ పీజీ ఆటో రిక్షాలకు అనుమతి, 10 వేల కొత్త సీఎన్ జీ అటో రిక్షాలకు అనుమతిని ఇచ్చారు.
ఈ క్రమంలో హైదరాబాద్ లో.. ముఖ్యంగా సీఎన్ జీ, ఎల్ పీజీ తీసుకొని రావడంపై.. ప్రజారవాణా మెరుగు పర్చాలని, వాయు కాలుష్యంను అదుపులో పెట్టవచ్చని సర్కారు భావిస్తుంది. అదే విధంగా.. గతంలో ఓఆర్ఆర్ లోపల ప్రజారవాణా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఎలక్ట్రిక్, సీఎన్ జీ, ఎల్ పీ జీ ఆటోలకు అనుమతినివ్వడంతో.. ప్రజారవాణా మెరుగు పడనుందని తెలుస్తుంది. దీనితో పాటు... ఆటో రిక్షాలు నడిపి జీవనం సాగించే వారి దాదాపు 65 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం రేవంత్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









