Hyderabad Police Issued notices to Senior Ias Smita Sabharwal: తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి, పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల స్మిత సబర్వాల్..తన ఇన్ స్టా ఖాతాలో.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏఐ ఫొటోను షేర్ చేశారు. ఈ నెల 12న స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు జారీ చేసినట్లు సమాచారం.
Hi @IASassociation, I'm curious about the guidelines for IAS officers sharing opinions or information that might be seen as opposing the government they serve. I noticed Smita Sabharwal reposted about #SaveHCU, which prompted my question about these boundaries. https://t.co/5ddXMwvLQZ pic.twitter.com/GdjowoIAB1
— Telangana (@The29thState) April 16, 2025
మార్చి 31న "హాయ్ హైదరాబాద్" అనే ఎక్స్ హ్యాండిల్ పోస్టును హెచ్ సీయూ ఏఐ ఫోటోను స్మిత రీపోస్ట్ చేశారు. అలాగే వాటిని జింకలు, నెమళ్లు చూస్తున్నట్లు గిబ్లీ ఇమేజ్ సైతం పెట్టారు. దీంతో స్మితా సబర్వాల్‌కు BNS 179 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు.
ఇప్పటికే ఈ అంశంపై రేవంత్ సర్కారు సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణ సర్కారు.. కంచ గచ్చి బౌలీ వివాాదంలో ఏఐ ఫోటోల అంశంలో ఏఐ ఫోటోలను పోస్టులు చేసిన చాలా మందిపై పోలీసులు కేసుల్ని నమోదు చేశారు.ఈ నేపథ్యంలో ఒక సీనియర్ అధికారిణి, తెలంగాణ ప్రభుత్వంలో పర్యాటక శాఖలో సెక్రటరీగా చేస్తున్న అధికారిణికి నోటీసులు జారీచేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









