)
Hyderabad police urges it companies on work from home: దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా రెండుస్టేట్స్ లు భారీ వర్షాలకు చిగురు టాకుల వణికిపోతున్నాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది.అంతే కాకుండా.. ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రానున్న మూడురోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీచేసింది. ఈక్రమంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అధికారుల సెలవుల్ని రద్దు చేసింది. స్కూళ్లకు సెలవుల్ని ప్రకటించారు. అవసరమైతే తప్ప బైటకు రావొద్దని అధికారులు ప్రజల్ని కోరారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో కూడా అధికారులు, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు, అన్ని విభాగాల్లోని అధికారులు సమన్వయంతో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో రేపు కూడా కుండ పోతగా వాన కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలతో హైదరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రేపు ఆగస్టు 14న వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ను ఎంప్లాయిస్ లకు ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ట్రాఫిక్, రోడ్లపై నీరు నిల్వకుండా అధికారులుచర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యోగులు తమ వాహనాల్లో వస్తుంటారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుంది. దీంతో గురువారం రోజున వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని హైదరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలను కోరారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు.. పోలీసులకు సహకరించాలని పోలీసులు ఒక ప్రకటనలో కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook