)
Hyderabad School Fee: ప్రస్తుతం విద్య ఏకంగా ఒక వ్యాపారంలా మారిపోయింది. ఫీజుల పేరిట పిల్లల చదువును వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ స్కూల్స్.. పేరెంట్స్‌ను నిలువునా దోచుకుంటున్నాయి. తమ పిల్లల ఫ్యూచర్ కోసం తల్లిదండ్రులు తమ జేబులు ఖాళీచేయడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. స్కూల్లలో కనీస వసతులు లేకపోయినా, నైపుణ్యాలు గానీ, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఉండకపోయినా.. ఫీజుల విషయంలో మాత్రం డిమాండ్ పెరిగిపోతుంది. ఇంకా పుస్తకాలు, యూనిఫామ్స్ అంటూ అదనపు ఖర్చులు కూడా తల్లిదండ్రులకు తలనొప్పిగా మారాయి. పిల్లల భవిష్యత్తు, వారి కలలు ఈ స్కూల్స్ చేతుల్లో బంధీగా మారాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ప్రభుత్వం కూడా ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల గురించి పర్యవేక్షించడం లేదు. దీంతో స్కూల్ యాజమాన్యాలు తమకు నచ్చినట్లుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైమరీ స్కూల్లో నర్సరీకి రూ. 2.51 లక్షలు, LKG, UKGకి రూ. 2.72 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారంటూ.. అనురాధ తివారీ అనే ఓ మహిళ షేర్ చేసిన అడ్మిషన్ ఫామ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులోని ఫీజులు చూస్తే దెబ్బకు దిమ్మ తిరగాల్సిందే.. అలా ఉన్నాయి ఆ సదరు ప్రైవేట్ పాఠశాలలోని ఫీజులు.
ఇంత భారీ ఫీజులకు స్కూల్ యాజమాన్యం ఎలా న్యాయం చేస్తున్నారని.. ఆ స్థాయిలో ఖర్చయ్యేంతగా పిల్లలకు ఏం నేర్పిస్తున్నారంటూ సదరు మహిళ ప్రశ్నించింది. ఈ నర్సరీ, LKG, UKGలో పిల్లలకు నేర్పించేది ఏబీసీడీలు, నెంబర్స్, తెలుగు వర్ణమాల మాత్రమే. కేవలం ఆటలు ఆడించి, ఏబీసీడీలు నేర్పడానికే ఇన్ని లక్షల ఫీజులు తీసుకోవడం ఏంటని నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. అయితే ఈ ఫీజును లెక్కిస్తే నర్సరీ చదివించేందుకు నెలకు రూ. 21,000 ఖర్చు అవుతుంది. ఇది ఓ సాధారణ ఉద్యోగి జీతంకి సమానం. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జీతంతో సరిపోవడం లేదు. ఇలా సంపాదించిందంతా పిల్లల స్కూల్ ఫీజుకే అయిపోతే.. సామాన్యుడు ఎలా బ్రతకటం..? కుటుంబాన్ని ఎలా పోషించడం..? అందుకే ఫీజుల నియంత్రణకై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు తమ డిమాండ్లను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.
అయితే.. ఈ కాలంలో కొంతమంది పేరెంట్స్ మైండ్‌సెట్ కూడా ఎలా ఉందంటే.. ఎంత ఎక్కువ ఫీజ్ ఉన్న స్కూల్లో తమ పిల్లలను చదివిస్తే తమకు సమాజంలో అంత గౌరవం ఉంటుందనే భ్రమలో బ్రతుకుతున్నారు. ఉన్నత వర్గాల వారు పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్లలో తమ పిల్లలను చదివిస్తుండటంతో.. ఎగువ మధ్య తరగతి వారు కూడా అప్పులు చేసి మరి తమ పిల్లలను అక్కడికే పంపిస్తున్నారు. ఇక దీన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు.. తమ స్కూళ్లకు ఇంటర్నేషనల్ స్కూల్ అని బోర్డులు పెట్టి.. కళ్లు చెదిరే బిల్డింగ్స్లలో స్కూళ్లను నడుపుతూ.. తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షల ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook