Hyderabad police identified mmts accused: హైదరాబాద్ లో యువతిపై ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార యత్నం ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై అన్ని రాజకీయా పార్టీలు సైతం స్పందించాయి. ప్రస్తుతం యువతిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేయడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై తొలుత యువతి తాను ట్రైన్ నుంచి పడిపోయానని పోలీసులకు చెప్పింది.
ఆ తర్వాత ఆమె ఇంట్లో వాళ్లు రావడంతో ధైర్యం తెచ్చుకుని అసలు విషయం బైటపెట్టింది. యువతి మేడ్చల్ కు చెందిన యువతి.. సికింద్రాబాద్ లో తన ఫోన్ రిపేర్ కోసం వెళ్లింది. పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో మేడ్చల్ ట్రైన్ ఎక్కింది. ఈ క్రమంలో మహిళల భోగీల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇద్దరు అల్వాల్ లో దిగిపోయారు. దీంతో అప్పటికే మహిళల భోగీలో కూర్చున్న సదరు కేటుగాడు.. యువతి దగ్గరకు వెళ్లి ఆమె చెయ్యిపట్టుకుని బలవంతం చేశాడు. తన గదికి రావాలని ఆమెను వేధించాడు. అతడ్ని మాటలో పెట్టిన యువతి.. ఒక్కసారిగా కొంపల్లీ సమీపంలో ట్రైన్ నుంచి కిందకు దూకేసింది.
ఈ క్రమంలో యువతిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత జీఆర్పీ పోలీసులు ఘటనపై ఆరా తీశారు. ఈ క్రమంలో యువతి తనపై అత్యాచార యత్నం జరిగిందని చెప్పింది. వెంటనే అనేక బృందాలుగా పోలీసులు అన్ని రైల్వేస్టేషన్ లలో సీసీఫుటేజీలను జల్లెడపట్టారు. దీనిలో మేడ్చల్ జిల్లా గౌడపల్లి గ్రామానికి చెందిన మహేష్ వ్యక్తిని గుర్తించారు. సదరు వ్యక్తిని ఏడాది క్రితం అతని భార్య వదిలేసినట్లు సమాచారం. ఇతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మరోవైపు కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళల భద్రతకు ఏ మాత్రం సెఫ్టీలేకుండా పోయిందన్నారు. తెలంగాణ ఇప్పటికి హోంశాఖలేదన్నారు.దీనిపై ఇప్పటికి కూడా తెలంగాణ సర్కారు స్పందిచకపొవడం బాధాకరమన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









