)
Hyderabad Rains: హైదరాబాద్‌లో మళ్లీ వరుణుడు ప్రతాపం చూపించాడు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని క్యుములో నింబస్ మేఘాలు కమ్మేశాయి. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వీటితో పాటు సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి కొనసాగుతుండడంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గవంటూ బాంబు పేల్చింది. వాతావరణం క్రమంగా మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్ , నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఇక 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరేడు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. భూ ఉపరితలం వేడెక్కడిన కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి మూడో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలుచోట్ల ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe