Yakuthpura Locals Showed angry on aimim mla jaffar hussain video: హైదరాబాద్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలన్ని జలమయమైపోయాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ ఎంసీ పరిధిలోని నాలాలు అన్ని కూడా పొంగి పోర్లుతున్నాయి.
అయితే... ఇతర ప్రదేశాలతో పోలీస్తే ఓల్డ్ సిటీ లోని ప్రజలు వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతే కాకుండా.. అక్కడ నాలాలన్ని పోంగిపోర్లి ప్రజల ఇళ్లలోకి వరద నీరు వచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి.
HyderayLocals showed anger on #AIMIM
MLA
ఎంఐఎం ఎమ్మెల్యేపై తిరగబడి దాడి చేసిన స్థానికులుహైదరాబాద్, #Yakuthpura పరిధిలో నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని #Nampally ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను నిలదీసిన స్థానికులు. #Hyderabad pic.twitter.com/2Pqg8Ecsdt
— Sanjay Sravani (@SanjuJournalist) June 13, 2025
ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాంపల్లిలోని యాకుత్ పురలో వరద ప్రభావిత ప్రాంతాల్ని సమీక్ష జరపడానికి ఎమ్మెల్యే జాఫన్ హుస్సెన్ తన అనుచరులు, అధికారులతో కలిసి అక్కడకు వెళ్లారు. అయితే.. ఈ క్రమంలో నాలా పొంగి పొర్లడం సమస్యను ఇప్పటికే పలు మార్లు అధికారులు, ఎమ్మెల్యేకు స్థానికులు చెప్పుకున్నారు.
కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకొలేదు. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే జాఫర్ హుస్సెన్ పై స్థానికులు ఒక్కసారిగా తిరగపడ్డారు. ఈ క్రమంలో స్థానికులకు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య తోపులాట జరిగింది.
గోబ్యాక్ అంటూ.. స్థానికులు నినాదాలు చేశారు. ఈ ఘటన కాస్త రచ్చగా మారడంతో అక్కడివారు గొడవల్ని ఆపే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఎంఐఎంకు కంచుకోట అయిన ఓల్డ్ సిటీ పరిధిలో అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై స్థానికులు దాడులు చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook