Hyderabad To Tirumala One Day Tour Package: తిరుమలలో నిత్యం వేలాది మంది భక్తులు తో కిటకిటలాడుతూ ఉంటుంది. వేసవి సెలవులు కూడా ముగియడంతో నిత్యం రద్దీగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లాలంటే కచ్చితంగా రెండు మూడు రోజులైనా సమయం పడుతుంది. అయితే ఇది కాస్త కష్టతరమే అవుతుంది. ముందస్తు ప్లాన్ గా వేసుకుంటేనే అది అమలు అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం ఒక కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఒక్కరోజులోనే తిరుమలకు వెళ్లి రావచ్చు. ఉదయం బయలుదేరితే సాయంత్రం వరకు ఇంట్లో ఉంటారు ప్యాకేజీ వివరాలు తెలుసుకుందాం..
తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం ఈ శుభవార్త తెలిపింది. ఉదయం 7 గంటలకు బయలుదేరితే రాత్రి 8 గంటల వరకు శ్రీవారి దర్శనం తో పాటు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్‌లో ఉంటారు. అయితే ఈ ప్యాకేజీ ఒక్కొక్కరికి రూ.12,499 రూపాయలు ఉంది.
టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..
టూర్ ప్యాకేజీ కాస్త ధర ఎక్కువగా ఉంది కానీ ఒక రోజులోనే తిరుమలకు వెళ్లి రావచ్చు. పద్మావతి అమ్మవారి దర్శనం కూడా కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల టూర్ ప్యాకేజీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర రూ. 15499.
హైదరాబాద్ టు తిరుమల వన్ డే టూర్ ప్యాకేజ్..
తిరుమల శ్రీవారి భక్తులు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరాల్సి వస్తుంది. ఉదయం 6:55 గంటలకు ఫ్లైట్ ఉంటుంది. మీరు తిరుపతిలో రేణిగుంటలో 8 గంటల వరకు చేరుకుంటారు.
టూర్ సిబ్బందికి వాళ్లు అక్కడ మీకు కారు అందుబాటులో ఉంచుతారు. ఇక ఏర్పోర్ట్ నుంచి నేరుగా తిరుపతిలోని హోటల్‌కు తీసుకు వెళ్తారు. అక్కడ కాసేపు విరామం తీసుకున్న తర్వాత నేరుగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు కూడా కారులోనే తీసుకువెళ్తారు.
ఇక మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ తర్వాత మళ్లీ తిరుపతి హోటల్ కి తీసుకువచ్చి కాసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. మళ్లీ పద్మావతి అమ్మవారిని దర్శనం భాగ్యం కల్పించి మళ్లీ తిరుపతి ఎయిర్‌పోర్ట్ కి తీసుకువస్తారు. శ్రీవారు, పద్మావతి అమ్మవారివి ప్రత్యేక దర్శనం ఉంటుంది.
సాయంత్రం 6: 30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ ఫ్లైట్ బయలుదేరుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 7:45 గంటలు అవుతుంది. ఇలా వన్ డే టూర్ ప్యాకేజీ తెలంగాణ టూరిజం ప్రకటించింది.
సాధారణంగా సడన్ ప్లాన్ వేసుకుంటే తిరుమలకు వెళ్లడం చాలా కష్టం. శ్రీవారి దర్శన భాగ్యానికి మూడు రోజుల టైం అయినా పడుతుంది. ఇలా ఆకస్మికంగా ప్లాన్ వేసుకునేవారు లేదంటే ఒకరోజు అవకాశం ఉన్నవాళ్లు ఈ టూర్ ప్యాకేజీని ఎంచుకోవచ్చు. ధర కాస్త ఎక్కువైనా సమయం ఆదా అవుతుంది.
Also Read: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఎన్టీఆర్, బాలకృష్ణలకు మాత్రమే సొంతం..
Also Read: ఈ పుట్టినరోజు నందమూరి బాలకృష్ణకు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









