Saroor nagar illegal activities video: ఇటీవల హైదరబాద్ లో అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని చెప్పుకొవచ్చు. ఒకవైపు డ్రగ్స్ దందా, మరోవైపు గాంజా అమ్మకాలు భాగ్యనగరంను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు చాలా చోట్ల మసాజ్ లు, స్పాల పేరిట యువతులతో క్రాస్ మసాజ్ లు చేయిస్తున్నారు. మొత్తంగా కొన్ని గ్యాంగ్ లు హైదరబాద్ బ్రాండ్ ఇమేజ్ ను గంగలో కల్పుతున్నారు.
పోలీసులు ఎంత పకట్బందిగా చర్యలు తీసుకున్నకూడా.. కొత్త మార్గాలలో అక్రమ దందాలు చేస్తున్నారు. పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ లో అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పబ్లిక్ గా మర్డర్ లు జరుగుతున్నాయి. హత్యలు, మాన భంగాలు, దోపీడీలు, చైన్ స్నాచింగ్ లు కూడా ఎక్కువయ్యాయి.
సరూర్ నగర్లో 10 మంది ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
సరూర్ నగర్ P&T కాలనీలో నివాసం ఉంటూ రెడ్ లైట్ ఏరియాగా మార్చిన ట్రాన్స్జెండర్లు
అర్ధరాత్రి రోడ్ల పైకి వచ్చి స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తూ, ఇష్టారీతిన సెక్స్ దందా చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన… pic.twitter.com/tI6EhrAkaw
— Telugu Scribe (@TeluguScribe) March 2, 2025
ఈ క్రమంలో తాజాగా.. ట్రాన్స్ జెండర్ లు కొన్ని ఏరియాలలో యువకులతో అసాంఘీక కార్యకలపాలు చేస్తున్నారు. తాజాగా.. సరూర్ నగర్ లోని కొన్ని ఏరియాలో ఇటీవల రాత్రి పూట ట్రాన్స్ జెండర్ లు యువకులతో డీల్ లు కుదుర్చుకుని అక్కడున్న ఇళ్లలోకి వెళ్లి.. అసాంఘీక కార్యక్రమాలు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అదేదో సినిమాల్లో ముంబైలాంటి మహానగరాల్లో చూపించిన విధంగా ట్రాన్స్ జెండర్ లో రోడ్ల మీద నిల్చుని .. వస్తు పోతున్న వారితో మాట్లాడి రేట్ లు ఫిక్స్ చేసుకుని మరీ వారితో వెళ్లిపోతున్నారు.
Read more: Holiday News: విద్యార్థులకు భారీ శుభవార్త.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా..?
ఈ వీడియోలను స్థానికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో పోలీసులు దీనిపై సీరియస్ అయ్యారు. పది మంది ట్రాన్స్ జెండర్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం హైదరబాద్ లో తీవ్ర కలకలంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









