HCU Lands Sale: హెచ్‌సీయూలో రాజుకున్న అగ్గి.. భూముల అమ్మకంపై విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తత

Hyderbad Central University Protest Against Revanth Reddy Land Sales: 'ఆ భూముల్లో పులులు.. సింహాలు ఉంటాయా..? వ్యతిరేకించే వారి వెనుక గుంటనక్కలు ఉన్నాయి' అని అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డి చేసిన ప్రసంగానికి హెచ్‌సీయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హెచ్‌సీయూలో ఉద్రిక్తత ఏర్పడింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 29, 2025, 09:12 PM IST
HCU Lands Sale: హెచ్‌సీయూలో రాజుకున్న అగ్గి.. భూముల అమ్మకంపై విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తత

HCU 400 Acres Land Dispute: అత్యంత జీవవైవిధ్యం కలిగిన భూములు.. హైదరాబాద్‌కు పచ్చదనం.. చల్లదనం అందించే నేల.. ఖరీదైన ప్రాంతంలో కొలువుదీరిన అటవీ ప్రాంతాన్ని అంగట్లో సరుకుగా అమ్మేందుకు చూస్తున్న కుట్రపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరు బాట పట్టారు. హెచ్‌సీయూలోని 400 ఎకరాల భూముల విక్రయంపై ఆందోళన సాగిస్తున్న విద్యార్థుల్లో రేవంత్‌ రెడ్డి ప్రసంగం అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యింది. 'అక్కడ ఏముంటాయి గుంటనక్కలు ఉంటాయి' అని చేసిన ప్రసంగంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డికి నిరసనగా వర్సిటీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో విద్యార్థులు వర్సెస్‌ పోలీస్‌గా వాతావరణం మారింది.

Add Zee News as a Preferred Source

Also Read: KCR Ugadi Wishes: ప్రజలకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శనివారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో 200 మందికి పైగా పోలీసులు మోహరించారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమి విక్రయించడానికి తాము అంగీకరించమంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ భూముల అమ్మకంపై అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Also Read: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అర్ధరాత్రి రైలు సేవలు పొడిగింపు

అనంతరం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మను తీసుకువచ్చి దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ఇరు వర్గాల పెనులాగటలో దిష్టిబొమ్మను ఎట్టకేలకు యూనివర్సిటీ విద్యార్థులు లాక్కుని దగ్ధం చేశారు. తమ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఖబడ్దార్‌ అంటూ విద్యార్థులు హెచ్చరించారు. ఇంతటి తమ పోరాటం ఆపమని.. ఆ భూముల విక్రయంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా పోరాటం చేస్తామని హెచ్‌సీయూ విద్యార్థులు ప్రకటించారు. కాగా ఈ పోరాటానికి రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యార్థి సంఘాలన్నీ మద్దతు పలికేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే ఈ పోరాటం ఉధృతమయ్యే అవకాశం ఉంది. రోహిత్‌ వేముల ఆత్మహత్య అనంతరం అట్టుడికినట్టు ఆ స్థాయిలో భూముల విక్రయానికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుందని నిఘా వర్గాలు వెల్లడించాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News