)
Nvs reddy appoints as advisor to Telangana govt: తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ లకు స్థానచలనం కల్పించింది. దీనిలో భాగంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. అంతేకాకుండా ఆయనకు తెలంగాణ ప్రభుత్వ పట్టణ సలహదారుగా కీలక బాధ్యతల్ని అప్పగించింది.
మెట్రో ఎండీగా సర్పరాజ్ అహ్మద్ కు అదనపు బాధ్యతల్ని రేవంత్ సర్కారు అప్పగించింది. ఎన్వీఎస్ రెడ్డి రెండెళ్ల పాటు ప్రభుత్వ పట్టణ సలహాదారుగా సేవలందించనున్నారు. ఈ నేపథ్యంలో వీరితో పాటు పలువురు ఐఏఎస్ లకు కూడా రేవంత్ సర్కారు బదిలీ చేసింది.
వీరిలో.. మహిళ, శిశు సంకేమ శాఖ డైరెక్టర్ గా శృతి ఓజా, ఎస్సీ గురుకులాల అదనపు బాధ్యతలు కృష్ణ ఆదిత్యకు అప్పగించింది. హెచ్ఎండీఏ కార్యదర్శిగా కోటా శ్రీవాత్సవకు అదనపు బాధ్యతలు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా ఎం. రాజారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా రాజేశ్వర్ లు నియమితులయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఒకవైపు అపోసిషన్ పార్టీలు చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొడుతూనే, మరోవైపు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల్ని నెరవేర్చేదిశగా ముందుకు వెళ్తుంది.
ఈ క్రమంలో అధికారుల్నికూడా తరచుగా మారుస్తు, పాలనను గాడిలో పెట్టేపనుల్ని నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం మెట్రోలు నష్టాల్లో ఉన్నాయని, మెట్రోలు నడపడం సాధ్యంకాదని ఇప్పటికే అనేక అంశాలు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మెట్రో ఎండీగా పనిచేసిన ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహదారుగా తీసుకొవడం వెనుక రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటా అని పొలిటికల్ సర్కిల్స్ లో, నెట్టింట రచ్చనడుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook