)
Heavy Rains fall alert in Telangana next 3 hours: తెలంగాణలో ప్రస్తుతం వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు స్టేట్స్ లు సైతం ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో సామాన్య జన జీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ క్రమంలో నిన్న తెలంగాణ వ్యాప్తంగా కుండపోతగా వానలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయిపోయాయి. ఎక్కడ చూసిన రోడ్లన్ని చెరువుల్ని తలపిస్తున్నారు.
భారీ వరద నీటి ప్రవాహంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్ర మరోసారి హైఅలర్ట్ ను జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా.. జనగామ, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం తెలంగాణలోని అన్ని జిల్లాల అధికారులకు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ క్రమంలో నిన్న హైదరాబాద్ భారీ వర్షం ప్రభావంతో ఎక్కడ చూసిన రోడ్లంతా కాల్వల్ని తలపిస్తున్నాయి. సోమాజిగూడ, దిల్ సుఖ్ నగర్, మేడ్చల్, ఉప్పల్, ఓయూ, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రదేశం, మియాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలలోకుండ పోతగా వాన కురిసింది.
ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. కాగా హైదరాబాద్‌లో భారీ వర్షపాతం నమోదు అయింది. మియాపూర్‌లో 9.7 సెం.మీ, లింగంపల్లిలో 8.2 సెం.మీ, సెంట్రల్ యూనీ వర్సీటీ పరిధిలో 8.1సెం.మీ, గచ్చిబౌలిలో 6.6 గా ఆయా ప్రాంతాల్లో వానలు దంచి కొట్టాయి. ప్రజలు బైటకు రాకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణాలు వాయిదా వేసుకొవాలని సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook