Imd weather fore cast rain fall alert for north Telangana: రెండు తెలుగు స్టేట్స్ లలో కొన్నిరోజులుగా ఒకవైపు వానలు పడుతున్నాయి. మరోవైపు ఎండలుకూడా బీభత్సంగా దంచికొడుతున్నాయి. అప్పటి వరకు జనాలు ఉక్కపోతతో బాధపడుతున్నారు.
మరోవైపు ఆకస్మిక వానలతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు నుంచి మూడు గంటలలో భారీగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వర్షం కురవనుందని వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ను జారీ చేసింది.
ముఖ్యంగా రానున్న మూడు గంటలలో ఉత్తర తెలంగాణ మండలంలోని ఆదిలాబాద్,కుమురంభీం, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో పిడుగులు, దట్టమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది.
ముఖ్యంగా రైతన్నలు.. ఇప్పటికే వరి, మొక్కజొన్న, జొన్న, మినుములు, పెసర్లు, వేరుశెనగ మొదలైన పంటలపై టార్పలిన్ కవర్లను కప్పి ఉంచాలని కూడా అధికారులు సూచించారు. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ను జారీ చేశారు.
Read more: Hyderabad: రన్నింగ్ ట్రైన్‌లో అత్యాచార యత్నం.. షాకింగ్ నిజం బైటపెట్టిన యువతి.. పోలీసులు సీరియస్..
అయితే.. ఇప్పటికే హైదరబాద్ లొ కొన్ని గంటల పాటు వర్షం దంచికొట్టింది. అంతేకాకుండా.. రోడ్లన్ని జలమయమయ్యాయి. డ్రైనేజీలన్ని నిండుకుండల్ని తలపిస్తున్నాయి. సామాన్య ప్రజలు కూడా మొత్తంగా ట్రాఫిక్ లో కొన్నిగంటల పాటు వర్షంలో నరకం అనుభవించారని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









