)
Imd weather update Heavy Rainfall in Telangana: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఎక్కడ చూసిన కూడా రోడ్లంతా జలమయం అయిపోయాయి. వర్షాల నేపథ్యంలో జనాలు బైటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. రోడ్లన్ని చెరువుల్ని, కాలనీలు వరదనీళ్లతో కుంటల్ని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయాయి.
ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో ఇంకా కుండపోతగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర హెచ్చరికల్ని జారీ చేసింది. మరోవైపు కామారెడ్డి, మెదక్ లకు మాత్రం రెడ్ అలర్ట్ ను జారీచేసింది. ఇటీవల కురిసిన వర్షాలతో ఇప్పటికే కామారెడ్డి, మెదక్ ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. అనేక కాలనీలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.
ఇళ్లలోకి నీరు రావడంతో ఫర్నీచర్ అంటూ ధ్వంసమైంది. ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నారు.ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ను జారీ చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. అదే విధంగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను కూడా ఐఎండీ జారీ చేసింది.
తెలంగాణలోని 16 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, పలు జిల్లాలతో పాటు, మరో 17 జిల్లాకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఈక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రజలకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook