Immadi ravi father sensational comments on his son: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన కూడా ఐబొమ్మరవి గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణ హైదరాబాద్ పోలీసులకు సవాల్ విసిరిని ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్త సినిమాలు, ఓటీటీల ప్లాట్ ఫామ్ మీద మూవీలు విడుదల కాగానే ఆన్ లైన్ లలో ఉచితంగా అందిస్తు ఐ బొమ్మ, బప్పంల నిర్వాహకుడ్ని పోలీసులు అదుపులోకి తీస్తున్నారు.
కరీబీయన్ దీవుల్లో ఉన్న రవి.. తన భార్యకు డైవర్స్ ఇచ్చేందుకు హైదరాబాద్ కు వచ్చాడు. దీంతో అతని భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వలపన్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అతడ్ని అదుపులోకి తీసుకొని అనేక విషయాల్ని రాబట్టారు.
తాజాగా, 'ఐ బొమ్మ' (iBomma), 'బప్పం టీవీ' వెబ్‌సైట్లను అతడితోనే శాశ్వతంగా మూసివేయించారు.
విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి సైబర్ టెక్నాలజీఅంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. తొలుత సాధారణ స్థాయిలో మొదలుపెట్టి, ఐ బొమ్మ, బప్పం వంటి వెబ్‌సైట్లను సృష్టించి తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల చిత్రాలను, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తూ వచ్చాడు. తన కార్యకలాపాలను ఎవరూ గుర్తించకుండా ఫ్రాన్స్‌లో నివసిస్తూ, కరేబియన్ దీవులు, యూరప్ దేశాల్లోని ఆఫ్‌షోర్ సర్వర్ల ద్వారా ఈ నెట్‌వర్క్‌ను నడిపాడు.
ఇదే క్రమంలో తన భార్యతో వివాదాలు ఏర్పడటంతో కొన్నేళ్లుగా దూరంగా ఉన్నాడు. అప్పటి నుంచి ఫుల్ టైమ్ తన పైరసీ సామ్రాజ్యంకు తన టైమ్ ఇస్తున్నాడు. ఇటీవల తన భార్యకు డైవర్స్ విషయంలో కరీబీయన్ నుంచి భారత్ కు వచ్చాడు. అతని భార్య ఇచ్చిన సమాచారంలో పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో రవి తండ్రి అప్పారావు విశాఖలో ఉంటున్నాడు.అతని కొడుకు గురించి ప్రశ్నించగా తన కొడుకు ఇలాంటి పనులు చేస్తున్నాడని తనకు తెలీదన్నారు. అదే విధంగా ప్రభుత్వంను, పోలీసుల్ని సవాల్ చేయడం పెద్ద తప్పని అన్నాడు. తాము ఎంతో కష్టపడి జీవిస్తున్నామన్నారు. తన కొడుకు ఇష్టప్రకారమే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని,ఆ తర్వాత ఇద్దరు కూడా విడిపోయారన్నారు.
Read more: Ibomma: బొమ్మ పడింది.. ఐబొమ్మ, బప్పం బ్లాక్ అయింది, చంచల్‌గూడ జైలుకు రవి..!
మొత్తంగా తన కొడుకు చేసింది తప్పేనంటూ అప్పారావు స్పష్టం చేశాడు. మరోవైపు హైదరాబాద్ పోలీసులు రేపు కోర్టులో రవిని హజరుపర్చి ఆ తర్వాత కస్టడికి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ ను దాఖలు చేయనున్నారు.ఈ ఘటన ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో ఐబొమ్మ రవి పట్ల సానుభూతి కూడా పెరుగుతుంది. చాలా మంది నెటిజన్లు రవిని సపోర్ట్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









