Gang Arrest: శుభకార్యాలే వారి టార్గెట్‌.. బంధువుల్లా వచ్చి దోచుకెళ్లే ముఠా అరెస్ట్‌

Interstate Thieves Gang Arrest By Adibatla Police: శుభకార్యాలు జరుగుతున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి భారీగా నగదు, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 30, 2024, 06:04 PM IST
Gang Arrest: శుభకార్యాలే వారి టార్గెట్‌.. బంధువుల్లా వచ్చి దోచుకెళ్లే ముఠా అరెస్ట్‌

Interstate Thieves Gang: శుభ ఘడియలు ఉండడంతో భారీగా శుభకార్యాలు జరుగుతున్నాయి. ఆ దొంగలకు ఇదే సరైన సమయం. శుభకార్యాలు జరుగుతున్న ఇళ్లు.. ఫంక్షన్‌ హాల్స్‌ వేదికగా చేసుకుని దోచుకెళ్తారు. బంధువులు.. స్నేహితుల్లా వచ్చి అందిన కాడికి దోచుకెళ్తున్న ముఠా నగరంలో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా ఆ ముఠాకు తెలంగాణ పోలీసులు ముకుతాడు వేశారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్‌ చేశారు. ముఠాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Konda Surekha: పులి దాడిలో మహిళా మృతి.. భారీగా నష్టపరిహారం అందజేత

మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి ట్రంకిల్ రిసార్ట్‌లో ఈనెల 14వ తేదీన జరిగిన ఓ వివాహం జరిగింది. ఆ వివాహ వేడుకలో దొంగతనం చోటుచేసుకుంది. ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో వివాహ కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వెంటనే ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read: Seethakka: పాలు సరఫరా చేస్తా లేదా? విజయ డెయిరీపై మంత్రి సీతక్క ఫైర్‌

ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర ముఠా శుభకార్యాలను  లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతోందని పోలీసులు గుర్తించారు. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు  పర్యవేక్షణలో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. గాలిస్తున్న క్రమంలో ఇద్దరు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. నిందితుల నుంచి రూ.40 వేల నగదు, 38 తులాల బంగారు ఆభరణాలతోపాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు మహేశ్వరం డీసీపీ  సునీత రెడ్డి తెలిపారు.

కాగా అరెస్టయిన నిందితులు గతంలోనే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలలో పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని డీసీపీ చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలకు కీలక సూచనలు చేశారు. శుభకార్యాలు చేసుకుంటున్న వారు కొంత అప్రమత్తతతో ఉండాలని.. గుర్తు తెలియని వ్యక్తులను అనుమానించాలని సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News