Jethwani Case: నటి జెత్వాని వేధింపుల కేసు.. ఐపీఎస్‌ సీతా రామాంజనేయులును అరెస్టు చేసిన ఏపీ పోలీసులు..

IPS Officer Arrest in Actor Jethwani Case: నటి జత్వాని వేధింపుల కేసులో ఈరోజు కీలక మలుపు చోటు చేసుకుంది. ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు అరెస్టు చేశారు. హైదరాబాదులో ఏపీ పోలీసులు నేడు అతని అదుపులోకి తీసుకున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Apr 22, 2025, 10:01 AM IST
Jethwani Case: నటి జెత్వాని వేధింపుల కేసు.. ఐపీఎస్‌ సీతా రామాంజనేయులును అరెస్టు చేసిన ఏపీ పోలీసులు..

IPS Officer Arrest in Actor Jethwani Case: ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఏపీ సీఐడీ అధికారులు ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులును ఈరోజు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇతనికి పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఆంజనేయులు ముంబై నటి జత్వాని కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే ఇప్పటికే వ్యాపారవేత్త అయిన విద్యాసాగర్ ను ఈ కేసులో అరెస్టు చేశారు.

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న పీసీఆర్ ఆంజనేయులును తాజాగా ఈరోజు ఉదయం హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు మాత్రమే కాదు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజుపై కూడా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన కేసులో కూడా ఆంజనేయులు నిందితుడు. అయితే మాజీ అధికారిని హైదరాబాద్ నుంచి ఏపీ పోలీసులు విజయవాడకు తరలించనున్నారు.

2024 ఆగష్టులో  హీరోయిన్ జత్వాని తనను తన కుటుంబాన్ని పోలీసులు చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మానవ హక్కులను ఉల్లంఘించి తమను ఈడ్చుకుంటూ అరెస్టు చేసి ఆ తర్వాత వదిలేశారని జత్వాని కేసులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఆంధ్రప్రదేశ్ అధికారులు సస్పెన్షన్ కి గురయ్యారు. అయితే కెవిఆర్ విద్యాసాగర్ మాత్రం తను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు అని చెప్పి మోసం, ఫోర్జరీ చేసిన ఆరోపణల చేశారు. చట్ట విరుద్ధంగా భూమికి సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించి అతని నుంచి డబ్బులు వసూలు చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆమెని ముంబైలో  2024 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. తాజాగా పీసీఆర్‌ ఆజంనేయులును ఈ కేసులో హైదరాబాద్‌లోని బేగంపేటలోని తన నివాసంలో అరెస్టు చేశారు.

అయితే ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్నా సీనియర్ ఐపీఎస్ అధికారులు క్రాంతి రానా టాటా, విశాల్ హైకోర్టు ముందు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆంజనేయులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి బెయిల్ కి అప్లై చేసుకోలేదు. అయితే జత్వాన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు  సినీ నిర్మాత కె.వి.ఆర్ విద్యాసాగర్ తో కుమ్మకైన ఐపిఎస్ అధికారులు చట్టవిరుద్ధంగా తనను తన తల్లిదండ్రులను అవమానించి 40 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు లేకుండా రెస్టు చేశారని జత్వాని ఆరోపించింది.  ఇక జత్వాని తెలుగు, హిందీ, పంజాబీ, మలయాళం చిత్రాల్లో నటించారు. ఆమె కొన్ని యాడ్స్‌లో కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News