)
17th isha gramotsavam event: భాగ్యనగర వేదికగా జరిగిన ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకలో బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ముఖ్య అతిథిగా హాజరైఆటగాళ్లను ఉత్తేజపరిచారు. ప్రముఖ యాంకర్ శ్రీమతి గాయత్రీ భార్గవి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక అంశాల కలుయికగా కోలాహలంగా గ్రామోత్సవం జరిగింది. తెలంగాణలో మరుగున పడుతున్న కళలను ఈ గ్రామోత్సవంలో ప్రదర్శించారు. ముఖ్యంగా గిరిజన జానపద నృత్యం ‘గుస్సాడి’తో పాటు, చిరుతల రూపకం ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ కార్యక్రమంలో సింగర్ రామ్ మిర్యాల, గాయిని స్ఫూర్తి జితేంద్ర అందించిన ప్రత్యక్ష సంగీత విభావరి కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.
ఈ వేడుకలో ఆటగాళ్లతో పాటు పోటీలను చూడడానికి వచ్చిన గ్రామస్థులు అందరూ ఎంతో ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేశారు. వాలీబాల్ పోటిల్లో అశ్వారావుపేట పోలీస్ టీం జట్టు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. శివాలయం సిక్స్ బాయ్స్ జట్టు, చిన్నరేవల్లి జట్టు, వూట్‌పల్లి విబిఏ జట్టు తరువాతి స్థానాల్లో నిలిచారు. మహిళల త్రోబాల్ పోటీలలో రాచర్ల గొల్లపల్లి టీం ఫస్ట్ ప్లేస్ లో నిలవగా.. కొతపల్లి వారియర్స్ టీం, భద్రకాళి టీం, సంపల్లి వారియర్స్ టీంలు తరువాతి స్థానాల్లో నిలిచాయి.
ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో గెలిచిన మొదటి రెండు జట్లు , సెప్టెంబర్ 21న ఈశా యోగాసెంటర్, కోయంబత్తూరులోని ఆదియోగి సద్గురుతో పాటు ఇంకా వేలాది మంది సమక్షంలో జరగబోయే నేషనల్ ఫైనల్స్ పాల్గొంటారు. ఫైనల్స్ లో గెలిచిన జట్లకు నగదు పురస్కారాలు అందించనున్నారు. వాలీబాల్ (పురుషులు): రూ. 5 లక్షలు, త్రోబాల్ (మహిళలు): రూ. 5 లక్షలు ఇవ్వనున్నారు. మొత్తంగా కోటి రూపాయలకు పైగా నగదు బహుమతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందజేయనున్నారు. 2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం, గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని మళ్లీ పునర్జీవం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలలో 22 జిల్లాలలో ఈ పోటీలు నిర్వహించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.