Telangana Budget 2025-26: కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌పై భారత రాష్ట్ర సమితి పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2025 - 2026 సంవత్సర బడ్జెట్ పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు.. ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుంది అని ఎద్దేవా చేశారు.
Also Read: Telangana Budget: ప్రభుత్వ ఉద్యోగులకు రేపు బడ్జెట్‌లో తీపి కబురు ఉంటుందా? నిరాశ తప్పదా?
అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ పార్టీ సభ్యులు మాట్లాడారు. 'ప్రభుత్వ అందమే సక్కగా లేదు అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతుంది ఈ ప్రభుత్వం' అని కేటీఆర్ విమర్శించారు. రంకెలు కాదు రేవంత్ రెడ్డి - అంకెలు ఎక్కడ పోయాయి? అని ప్రశ్నించారు. ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుందని.. పరిపాలనకు చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ అని విమర్శించారు. ఈ బడ్జెట్‌లో 6 గ్యారంటీలు గోవిందా.. వాటికి పాతర వేశారని మండిపడ్డారు. మహిళలు, దివ్యాంగులకు ఇచ్చిన హామీలపైన బడ్జెట్‌లో ప్రస్తావించలేదని చెప్పారు. ఈ ప్రభుత్వానికి 40 శాతం సమయం ఈ బడ్జెట్‌తో సమసిపోయిందని కేటీఆర్ తెలిపారు.
Also Read: Revanth Reddy: 'శుభాకాంక్షలు నాకు వద్దు.. రాహుల్ గాంధీకి చెప్పండి'
'తుల బంగారం దిక్కు లేదు. చేనేతకు మా హయాంలో రూ.1,200 కోట్లు కేటాయిస్తే.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.300 కోట్లకు పరిమితం చేశారు. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. యాదవ సోదరుల ప్రస్తావన బడ్జెట్‌లో లేదు' అని కేటీఆర్ వివరించారు. గౌడన్నలకు వైన్స్ షాపులో 25 శాతం రిజర్వేషన్ ఇస్తామనీ చెప్పిన హామీ ప్రస్తావన లేదని తెలిపారు. 'దళిత సోదరులను మోసం చేశారు. నిరుద్యోగులకు ఒక్క హామీ ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, కాగితాలు ఇచ్చింది ఈ సన్యాసి ప్రభుత్వం' అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పేదల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. ట్రిలియన్ డాలర్‌లో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని దరిద్రపు ప్రభుత్వం అని మండిపడ్డారు. కరోనా కంటే డేంజర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పేక మేడలా కుప్పకూల్చారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









