Youth Golden Chance: రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్రవ్యాప్తంగా యువతి, యువకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. 16.22 లక్షల మంది తమ వ్యాపార ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు సబ్సీడీతో కూడిన పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాదికి 5 లక్షల మంది అర్హులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. దీని కోసం రూ.6,250 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో జూన్ 2న రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. రూ. 50 వేల వరకు వంద శాతం, రూ.లక్ష వరకు 90 శాతం, రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ కింద రుణాలు మంజూరు చేయనున్నారు.
Also Read: Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు జాక్‌పాట్.. 7 రోజులు బ్యాంకులు బంద్
జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందిచనున్నారు. అలాగే జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో వారికి నైపుణ్యాలు మెరుగుపరచడానికి ప్రభుత్వంతో ఎంప్యానల్ చేసుకున్న సంస్థలు ఎంట్రప్రెన్యూరియల్‌షిప్ డెవలెప్‌మెంట్ ట్రైనింగ్ ఇస్తారు. జూన్ 16 నుంచి ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీ జయంతి నాటికి యూనిట్లన్నీ గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగి అకస్మాత్తుగా చనిపోతే వచ్చే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
22 లక్షల ఉద్యోగాల లక్ష్యం
రాజీవ్ యువ వికాసం కింద లబ్ధిపొందనున్న 5 లక్షల మంది నిరుద్యోగలు ఎంఎస్ఎంఈ రంగంలో విభిన్న వ్యాపారాలను ప్రారంభించనున్నారు. తద్వారా మున్ముందు తెలంగాణలో 22 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆల్ ఇండియా సెన్సెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈ నాలుగవ నివేదిక ప్రకారం.. దేశంలో ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ సగటున 4.40 మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని లెక్కగట్టింది. ఈ లెక్కన 5 లక్షల మంది స్వయం ఉపాధి యూనిట్లు ప్రారంభించడం ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలో 22 లక్షల ఉద్యోగాల సృష్టి సాధ్యమవుతుందని, ఇది వెనుకబడిన తరుగతుల సామాజిక-ఆర్థిక స్థితిగతులను సమూలంగా మారుస్తుంది, అంతేకాకుండా రాష్ట్ర జీఎస్‌డీపీ మెరుగవడానికి ఇతోదికంగా దోహదం చేస్తుందని ప్రభుత్వం ఆశాభావంగా ఉంది.
పథకం లబ్ధిదారుల్లో వారే 80 శాతం
రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిపొందనున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలకు చెందిన వారు 80% వరకు ఉన్నారు. బీసీలు అత్యధికంగా 31.44%, ఎస్సీలు 29.36%, ఎస్టీలు 19.59% ఉన్నారు. మొత్తంగా 79.39% ఉన్నారు. ఎస్సీ,ఎస్టీలు 47% ఉన్నారు. రాహుల్ గాంధీ సూచనల మేరకు కులగణ ఆధారంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఈ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది. ఎలాంటి అవినీతికి, వివక్షకు తావులేకుండా ప్రభుత్వం ఆయా వర్గాల నుంచి 5 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. మొత్తం లబ్ధిదారుల్లో 25% మహిళలకు, 5% దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









