Pawan Kalyan: పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జయకేతనం పేరుతో ఏర్పాటైన 12వ వార్షికోత్సవ సభలో పవన్ ఎక్కువగా తెలంగాణ గురించే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ గడ్డపై నా తెలంగాణ అంటూ చెప్పడం కాకతాళీయం కాదని, ప్రణాళికలో భాగమని సూచిస్తోంది.
పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా తెలంగాణ అంశాలే ప్రస్తావించారు. పార్టీ జన్మస్థలమే తెలంగాణ అని చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం చేశారు. గతంలో తాను కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉంటే కొండగట్టు ఆంజనేయస్వామి దయతో ప్రాణాలు కాపాడుకున్నట్టు చెప్పారు. గద్దర్‌పై అభిమానం వ్యక్తపరిచారు. దాశరధి కృష్ణమాచార్యుల గురించి గుర్తు చేసుకున్నారు. ఆయన సాహిత్యంతో ప్రభావితమయ్యానన్నారు. అంతేకాదు..రుద్రవీణ వాయిస్తా..అగ్నిధారలు కురిపిస్తామనే దాశరధి మాటలు నిజం చేశామని చెప్పుకొచ్చారు. ఈ మాటలేవీ అలవోకగానో లేదా కాకతాళీయంగానే చేసినవి కావని తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్టీని తెలంగాణలో విస్తృతం చేసే ఆలోచనలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలో తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వాదన విన్పిస్తోంది.
వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బలంగా బీజేపీ ఎదుగుతోంది. క్రమంగా ఓటింగ్ శాతం పెంచుకుంటోంది. ఈ క్రమంలో బీజేపీకు ఇతర పార్టీల సహకారం తోడైతే అధికారంలో రావచ్చనేది అంచనా. ఏపీలో బీజేపీ-జనసేన-తెలుగుదేశం హిట్ ఫార్ములా ఇది రెండవసారి. 2014లో తొలిసారి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. జనసేన పోటీ చేయకపోయినా నేరుగా మద్దతు తెలిపింది. 2019లో మూడు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసి బోర్లా పడ్డాయి. 2024లో మళ్లీ కలిసి పోటీ చేసి భారీ విజయంతో అధికారం చేపట్టాయి. ఇదే హిట్ ఫార్ములాను తెలంగాణలో అమలు చేసే ఆలోచన ఉందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీకు సానుభూతిపరులు రాష్ట్రంలో ఇంకా మిగిలే ఉన్నారు. బీజేపీ బలం పుంజుకుంటోంది. సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ హిందూవులను పోలరైజ్ చేసే పనిలో ఉన్నారు.
ఆంధ్ర గడ్డ మీద జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిన పవన్ కళ్యాణ్
నా తెలంగాణ కోటిరతనాల వీణ
కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు పునర్జన్మనిచ్చింది కొండగట్టు ఆంజనేయస్వామి దీవెనలు, నా అభిమానుల దీవెనలు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/KQvDugZHO7
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2025
అందుకే ఈ మూడు పార్టీల కూటమి తెలంగాణలో కూడా రిపీట్ కావచ్చనే అంచనా ఉంది. ఎందుకంటే ఇది అసాధ్యమయ్యే ఆలోచన కానే కాదు. మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళితే విజయం సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఏపీ హిట్ ఫార్ములాను తెలంగాణలో అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఏపీలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తెలంగాణ అంశాల్ని ప్రస్తావించారని సమాచారం. బీజేపీ అధిష్టానం ఇచ్చిన సంకేతాలతోనే పవన్ ఇలా మాట్లాడారనే విశ్లేషణ కూడా విన్పిస్తోంది. మరి ఏపీ హిట్ ఫార్ములా తెలంగాణలో ఎప్పుడు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Also read: Nagababu: పిఠాపురం వర్మకు నాగబాబు కౌంటర్..! టీడీపీలో దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









