Jubilee Hills By Poll 3 Days School Holidays Minister Reacts: విద్యార్థులకు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవు రానుంది. 11వ తేదీన పెయిడ్ హాలిడే ప్రకటించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నవంబర్ 11వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉద్దేశంతో మంగళవారం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సెలవుపై తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇది కేవలం ఆ నియోజకవర్గ పరిధిలో మాత్రమే వర్తిస్తుంది.
11న సెలవు.. మంత్రి కీలక విజ్ఞప్తి..
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో నవంబర్ 11వ తేదీన వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఆయన వీడియో కూడా విడుదల చేశారు. జూబ్లీహిల్స్ పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇకనైనా ప్రతి ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటరు తన ఓటు హక్కు వినియోగించాలి. జూబ్లీహిల్స్ అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించాలని కంటోన్మెంట్‌లో ఎలా తీర్పు ఇచ్చారో అదే విధంగా జూబ్లీహిల్స్‌లో కూడా తీర్పు ఇవ్వాలని పొన్నం ఓటర్లను కోరారు.
జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలి
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది..
జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం..
గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభివృద్ది కి… pic.twitter.com/0hiJ0qtT0E
— Ponnam Prabhakar (@Ponnam_INC) November 8, 2025
4 రోజులు వైన్‌షాపులు బంద్..
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం పోటా పోటీగా ప్రచారం సాగుతోంది. రేపు సాయంత్రం ఐదు గంటలకు 144 సెక్షన్ అమల్లోకి రానుంది. అప్పటి నుంచి మందు షాపులు కూడా బంద్ ఉండనున్నాయి. మొత్తంగా నాలుగు రోజులపాటు వైన్ షాప్స్ బంద్ ఉంటాయి. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మందు షాపులు బంద్ ఉంటాయి. అదే విధంగా నవంబర్ 14వ తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాబట్టి ఆ రోజు కూడా వైన్ షాపులు బంద్ ఉంటాయి. నాలుగు రోజులపాటు లిక్కర్ షాపులు మూతపడి ఉండనున్నాయి.
అయితే. రేపు ఆదివారం అన్నీ స్కూళ్లకు సెలవు ఉంటుంది. సోమవారం 10వ తేదీ స్కూళ్లలో ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ బై ఎలక్షన్ జరిగే ప్రాంతాలలో ముందు రోజు కూడా అంటే నవంబర్ 10వ తేదీ కూడా స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులకు విద్యాసంస్థల నుండి మెసేజులు కూడా పంపిస్తున్నారు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది. ఇదిలా ఉండగా నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.
Read more: రేపటితో ఎన్నికల ప్రచారం బంద్.. సాయంత్రం ఐదు గంటల తర్వాత అంతా గప్‌చుప్..!
Read more: మంగళవారం సెలవు..! విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ బంద్ ఉత్తర్వులు జారీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









