)
Jubilee Hills By Poll: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మొదటి సారి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు యాక్సిడెండ్ లో చనిపోవడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎలెక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించారు. ఆ తర్వాత జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ మరణంతో జూబ్లిహిల్స్ లో ఎన్నిక అనివార్యమైంది. బిహార్ ఎన్నికలతో పాటు జూబ్లిహిల్స్ కు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది. దీంతో ఇపుడు ఈ సీటులో కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలనే ప్రయత్నాలు ముమ్మురం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ హిల్స్ టిక్కెట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టడంతో పాటు మంత్రి పదవి ఖాయమనే ముచ్చట కనిపిస్తోంది.
దాంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ సీటు హాట్ సీటుగా మారింది. ఇక్కడ గెలిచి అమాత్య పదవి పొందాలని ఆశావహులు పోటీపడుతున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నవీన్‌కుమార్ యాదవ్, ఫహీం ఖురేషీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌లు జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆసక్తి ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తాను పోటీ చేస్తానంటూ ఎమ్మెల్యే దానం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జి.వివేక్‌కు సమాచారం ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
అభ్యర్థుల బలాబలాలపై కీలక నేతలు బేరీజు వేస్తున్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో హస్తం పార్టీకి ఒక్క సీటు దక్కలేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో శ్రీగణేష్‌కు టిక్కెట్ ఇచ్చి గెలిపించడంతో జిల్లాలో తొలి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన గుర్తింపు పొందారు. రెండో ఉప ఎన్నికలోనూ గెలవాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి రాగానే ఆశావాహుల బలాబలాలు బేరీజు వేసి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జూబ్లిహిల్స్ లో గెలిస్తే వారికి మంత్రి పదవి ఖాయమనే ముచ్చటనే మాట వినిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.