Jubilee Hills By Poll Results 2025 Candidate Death: నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మహమ్మద్ అన్వర్ (40) అర్ధరాత్రి గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ఎర్రగడ్డలో నివాసం ఉండే ఆయన అక్టోబర్ 22న నామినేషన్ వేశారు. ఇక ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ కూడా యాక్సెప్ట్ చేయగా బరిలో నిలిచారు. ఫలితాలకు ఒకరోజు ముందే తీవ్ర విషాదం నెలకొంది. మహమ్మద్ అన్వర్ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అక్టోబర్ 23 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు దాఖలు అయ్యాయి. 300 పైగా నామినేషన్లు వచ్చాయి. వివిధ కారణాలతో నామినేషన్లు వేశారు. అయితే అక్టోబర్ 22 నుంచి ఈ నామినేషన్‌లకు సంబంధించి స్క్రూటినీ కూడా జరిగింది. నామినేషన్ల వివరాలు సరిగ్గా లేకపోవడం కొంతమంది నామినేషన్‌లు తిరస్కరణ చేశారు. రీజనల్ రింగ్ రోడ్ బాధితులతో పాటు ఓయూ, నిరుద్యో సంఘాల నాయకులు కూడా ఈ ఉప ఎన్నికలో నామినేషన్ వేశారు.
2025 నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. 14వ తేదీ అంటే ఈరోజు ఈ పోలింగ్‌కు సంబంధించిన ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ఈ పోటీ నెలకొంది. అత్యధికంగా 325 వరకు నామినేషన్లు వచ్చాయి. వడపోత తర్వాత కేవలం 81 మంది నామినేషన్లు మాత్రమే రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారు.
ఉప ఎన్నికల్లో ఈసీ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. అయితే, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుంది. ఇతరులకు ప్రవేశం ఉండదని కూడా తెలిపారు. ఆ చుట్టుముట్టు ప్రాంతంలో 144 సెక్షన్ కూడా విధించారు. మొత్తంగా 42 టేబుల్స్ ఏర్పాటు చేసి 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో 180 మంది సిబ్బందిని నియమించారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు కూడా తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,01,365 ఉండగా ఇందులో పురుషులు 2, 8561, స్త్రీలు 1,092,79 ఇతరులు 25 మంది ఉన్నారు. అయితే ఉప ఎన్నికల్లో కేవలం 1,94,631 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 48.49 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. దీనికి సంబంధించిన తుది ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి.
Also Read: జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. మధ్యాహ్నం 12 గంటలలోపే తుది ఫలితం..!
Also Read: జూబ్లీహిల్స్ ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్‌డేట్స్.. క్షణక్షణం ఉత్కంఠ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









