
kaleshwaram project commission Serious on cm revanth reddy govt: గత బీఆర్ఎస్ హయాంలో పలుప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో దీనిపై పీస్ ఘోష్ కమిషన్ ను రేవంత్ సర్కారు నియమించింది. ఇప్పటికే కాళేశ్వరం ఎదుట ఈటెల రాజేందర్, హరిష్ రావు, సీఎం కేసీఆర్ లు హజరయ్యారు. వీరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణకు సంబంధించిన కీలక సమాచారంను సేకరించినట్లు తెలుస్తొంది.
ఈ నేపథ్యంలో కమిషన్ తాజాగా.. మంత్రివర్గ సమావేశాల తీర్మానాలను అందించాలని పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాయడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై.. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించి కమిషన్‌కు గత ప్రభుత్వ కేబినెట్ తీర్మానాల రికార్డులను అందించాలని ఆదేశించారు.
కాళేశ్వరంలో జరిగిన అక్రమాలకు నిగ్గు తెల్చడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన కాళేశ్వరం కమిషన్ దర్యాప్తు వేగంను పెంచింది. ఇప్పటికే గత ప్రభుత్వహయాంలో కాళేశ్వరంతో లింక్ అప్ గా ఉన్న అధికారుల్ని కమిషన్ విచారించింది. ఈ క్రమంలో ఇప్పటికే.. గత ప్రభుత్వంలోని కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ప్రభుత్వంకు తాజాగా కమిషన్ మూడోసారి లెటర్ రాసింది.
అదే విధంగా ఎన్ని సార్లు లేఖ రాయాలంటూ రేవంత్ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ మండిపడింది. ఈ క్రమంలో.. కేసీఆర్‌ను దోషిగా నిరూపించాలి అనుకుంటే కాళేశ్వరం కమిషన్ వ్యవహారం వారికే బుమరాంగ్ అయ్యేలా ఉందని ప్రస్తుతం రాజకీయాల్లో చర్చ నడుస్తుంది.
గతంలోనే.. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు లేఖ రాసిన కమిషన్.. తాజాగా మూడోసారి లేఖను రాయడంతో పాటు.. రేవంత్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది.
ఇంజనీర్లు ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ తర్వాత ఓసారి, ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ కమిషన్ లేఖల్ని రాసింది. మరోవైపు.. కమిషన్‌కు మినిట్స్ ఇవ్వాలా, వద్దా అని కేబినెట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్చించనున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.