K Chandrashekar Rao: 'తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో అర్థమైంది.. ఇక రాబోయేది మనమే!'

Telangana People Realised What They Lost Says Ex CM KCR: తెలంగాణ ప్రజలకు ఏం కోల్పోయారో అర్థమవుతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ఉద్యమ స్పూర్తి కలిగిన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అర్థం చేసుకోగలదు స్పష్టం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 5, 2025, 10:36 PM IST
K Chandrashekar Rao: 'తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో అర్థమైంది.. ఇక రాబోయేది మనమే!'

K Chandrashekar Rao: 'తెలంగాణ బాగోగుల పట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఉన్నంత ఆవేదన మరే ఇతర పార్టీకి ఉండదు. ప్రజల సంక్షేమం అభివృద్ధి గురించి అహర్నిశలు కృషి చేసిన ఉద్యమ స్ఫూర్తి బీఆర్ఎస్ పార్టీ సొంతం' అని గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. దశాబ్దాల పాటు పోరాటాలు చేసి నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన తెలంగాణ సమాజానికి స్వరాష్ట్ర చైతన్యాన్ని నింపి.. రాష్ట్ర సాధనకోసం శాంతియుత పంథాలో ప్రజా పోరాటాలు నడిపిన ఘన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులది అని కొనియాడారు.

Add Zee News as a Preferred Source

Also Read: KCR Speech: 'కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజల పాలిట శాపం': మాజీ సీఎం కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభపై ఎర్రవల్లిలో పార్టీ నాయకులతో నిర్వహించిన సన్నాహాక సమావేశంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ సాధన అనంతరం ప్రజలు ఇచ్చిన ఆదరణతో తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించి.. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమ స్ఫూర్తితో సాగించిన బీఆర్ఎస్ పార్టీ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచింది' అని కేసీఆర్‌ తెలిపారు. వ్యవసాయంతో పాటు సమస్త రంగాలు, సబ్బండ వర్ణాలకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన సేవ మహోన్నతమైనదని చెప్పారు. అంతటి చిత్తశుద్దితో పట్టుదలతో ప్రజలే కేంద్రంగా వారి అభ్యున్నతే ధ్యేయంగా పనిచేయడం బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని ప్రకటించారు. 'తాము ఏమీ కోల్పోయమోననే ఏడాదిన్నర పార్టీ పాలన ద్వారా ప్రజల అనుభవంలోకి వచ్చింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు' అని గులాబీ బాస్‌ చెప్పారు.

Also Read: BRS Party: రజతోత్సవానికి గులాబీ దళం సిద్ధం.. పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ దిశానిర్దేశం

ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్, సాగు.. తాగునీరు సహా మౌలిక వసతుల లభ్యత విషయమై పార్టీ నాయకులతో కేసీఆర్‌ ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజల బాధలు, కష్టనష్టాలు.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును నాయకులు కేసీఆర్‌కు వివరించారు. ఇన్నాళ్లు పుష్కలంగా రెండించుల పైపు నిండా నీళ్లు పోసిన వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయని చెప్పారు. 'మీరు చెప్పేవన్నీ ఇప్పటికే నాకు సమాచారం అందుతోంది. ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో రైతులు దుస్థితి దయనీయంగ ఉంది' అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 'పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో దేశ ప్రగతికి రాష్ట్ర ఆర్థిక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఫరిఢవిల్లిన తెలంగాణ పల్లెలు నేడు కనీస ఆదరణ లేక కూనారిల్లుతున్నాయి' అని మాజీ సీఎం కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

'కేవలం అధికారం కోసమే అలవిగాని హామీలిచ్చి.. కనిపించిన దేవుడి మీద ఒట్లు పెట్టి బూటకపు గ్యారెంటీలతో ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ నమ్మించింది. ప్రభుత్వంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఏమీ చేయకపోగా చేస్తున్నట్టు మభ్యపెడుతుండడంతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు' అని నాయకులతో కేసీఆర్‌ చెప్పారు. రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తారని.. అద్భుతంగా సాగుతుందని కేసీఆర్‌ పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News