Kavitha: 'అసెంబ్లీ'లో ఏప్రిల్‌ 11వలోపు పూలే విగ్రహం పెట్టాలి: కల్వకుంట్ల కవిత

K Kavitha Meets To Speaker On Mahatma Jyotirao Phule Statue At Assembly: గతంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటుచేయించిన ఎమ్మెల్సీ కవిత తాజాగా ఫూలే విగ్రహం కోసం పోరాటం తీవ్రం చేశారు. వెంటనే ఫూలే విగ్రహం ఏర్పాటుచేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 26, 2025, 10:17 PM IST
Kavitha: 'అసెంబ్లీ'లో ఏప్రిల్‌ 11వలోపు పూలే విగ్రహం పెట్టాలి: కల్వకుంట్ల కవిత

Mahatma Jyotirao Phule Statue: బీసీ ఉద్యమాన్ని చేపడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం పోరాటాన్ని తీవ్రం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌ 11వ తేదీలోపు అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుచేసేలా చూడాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కాలేరు వెంకటేశ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారు లక్ష్మా రెడ్డి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్ల శివ శంకర్‌తో కలిసి స్పీకర్‌ను కలిశారు.

Add Zee News as a Preferred Source

Also Read: KT Rama Rao: తెలంగాణలో దయనీయ పరిస్థితులు ఉంటే అందాల పోటీలా? కేటీఆర్‌

మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని వచ్చే నెల 11వ తేదీన పూలే జయంతిలోగా అసెంబ్లీ ఆవరణలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవితతోపాటు యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌ విజ్ఞప్తి చేసింది. వెనుకబడిన వర్గాల పట్ల వివక్షకు ముగింపు పలకాలని ఈ దేశ సామాజిక సమానత్వానికి బాటలు వేసిన దార్శనికులు పూలే అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బడుగుల జీవితాలలో అక్షర వెలుగులు నింపి ఎంతో మంది మంది సంఘ సంస్కర్తలకు వేగుచుక్కగా నిలిచి దారి చూపారని కొనియాడారు.

Also Read: KT Rama Rao: తెలంగాణలో దయనీయ పరిస్థితులు ఉంటే అందాల పోటీలా? కేటీఆర్‌

ఉదాత్తమైన భావాలు చట్టసభల్లో నిరంతరం ప్రతిఫలించడానికి మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసనరం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తుచేశారు.పేర్కొన్నారు. సమానత్వ స్పూర్తిని అనునిత్యం చట్టసభల స్మృతిపథంలో నిలిపే సదుద్దేశంతో పూలే విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుచేశారు. ఇదే అంశంపై గతేడాది జనవరి 21వ తేదీన లేఖ ఇచ్చామని చెప్పారు.

అసెంబ్లీలో పూలే విగ్రహం ఉండాలన్నది వివిధ సామాజిర సంస్థలు, బీసీ సమాజపు చిరకాల కోరిక అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె కవిత తెలిపారు. ఈ విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్పూర్తిని మరింత ఇనుమడింపచేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి పోరాటాలతో ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం నెలకొల్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News