Kavitha Womens Day: 'మార్చి 8న ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేయాలి'

K Kavitha Demands Scooteys For Womens On March 8th: మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన డిమాండ్‌ చేశారు. మార్చి 8వ తేదీ నుంచి మహిళలకు ఉచితంగా స్కూటీలు పంపిణీ చేయాలని కోరారు. ఆ వార్త విశేషాలు ఇవే.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 3, 2025, 05:04 PM IST
Kavitha Womens Day: 'మార్చి 8న ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేయాలి'

Telangana Free Scooteys: ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి వెంటనే నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. మహిళలకు ఇచ్చిన రూ.2,500 నగదు సహాయం, స్కూటీలు వెంటనే పంపిణీ చేయాలని కోరారు. మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల సాధన కోసం తెలంగాణ జాగృతి ద్వారా పోస్ట్‌కార్డ్ ఉద్యమాన్ని కవిత ప్రారంభించారు. వెంటనే డిమాండ్లు నెరవేర్చాలని లేకపోతే భారీ ఉద్యమం నిర్మిస్తామని ప్రకటించారు.

Add Zee News as a Preferred Source

Also Read: MLC Elections: రేవంత్ రెడ్డికి సీపీఐ ఝలక్.. 'రెండూ' ఇచ్చేయాలని ఆల్టిమేటం

మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి సేకరించిన 10 వేల పోస్ట్‌కార్డ్‌లు రేవంత్ రెడ్డికి పంపించారు. మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై మార్చి 8వ తేదీన ప్రకటన చేయకపోతే 10 వేల మహిళలు 10 వేల గ్రామాల్లోకి వెళ్తామని తెలిపారు. లక్షలాది పోస్ట్‌కార్డ్‌లను తయారు చేసి సోనియా గాంధీకి కూడా పంపిస్తామని ప్రకటించారు. మహిళల విషయంలో రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదని మండిపడ్డారు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని హితవు పలికారు.

Also Read: Dasoju Sravan Kumar: ఈసారైనా దాసోజు శ్రవణ్‌కు 'ఎమ్మెల్సీ' దాసోహమవుతుందా?

'సోనియా, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి మేం ధర్నా చేశాం. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదు' అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు.. ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్‌కు పోలిక లేదని తెలిపారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు కేవలం పదుల సంఖ్యలో మహిళలకు తప్ప.. పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశం లేదని కె కవిత స్పష్టం చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్‌ చేశారు. మార్చి 8న ఈ పథకాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News