K Kavitha Press Meet: తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన లేఖపై బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బహిర్గతమైందో తనకు తెలియదని పేర్కొన్నారు. పార్టీలో కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మా నాయకుడికి రాసిన ఎలా బహిర్గతమైందో తెలియదని పేర్కొన్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ లేఖను చూసి కాంగ్రెస్, బీజేపీలు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.
Also Read: KT Rama Rao: రేవంత్ రెడ్డి దోపిడీ బాగోతం గ్రామగ్రామానికి చేరింది: కేటీఆర్
'అమెరికా నుంచి వచ్చేలోపల ఏదో లేఖ బయటకు వచ్చిందని చాలా హంగామా నడుస్తోంది. రెండు వారాల కిందట నేను కేసీఆర్‌కు ఒక లేఖ రాశా. కేసీఆర్‌కు గతంలో కూడా నా అభిప్రాయాలను లేఖ రూపంలో రాశా. మొన్ననే కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్పిన కొద్దిరోజులకే నేను అంతర్గతం రాసిన లేఖ బహిర్గతమైంది. నేను అంతర్గతంగా రాసిన లేఖ బహిర్గతం కావడం అనేది పార్టీలో ఉన్న అందరం.. తెలంగాణలో ఉన్న ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం' అని కల్వకుంట్ల కవిత తెలిపారు.
'నేను ఏ విషయాలు చెప్పలేదు. అన్ని స్థాయిలో ఉన్న నాయకులు అనుకున్న విషయాలు.. నేను తెలంగాణ పర్యటనలో జరిగిన విషయాలను చెప్పను. నాకు వ్యక్తిగత అజెండా.. ఎలాంటి లక్ష్యం లేదు. కానీ నేను రాసిన లేఖ చాలా అంతర్గతంగా పార్టీ అధినేతకు రాసినది బయటకు రావడం అంటే దాని వెనుక ఎవరు ఉన్నారనేది ఆలోచించుకోవాలి' అని కవిత వివరించారు. 'కేసీఆర్ దేవుడు. కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి. వారి వలన చాలా నష్టం జరుగుతోంది. పార్టీలో ఉన్నటువంటి నేను, కేసీఆర్ కుమార్తె అయిన నేను ఆఅంతర్గతంగా రాసిన లేఖ బయటకు వచ్చిదంటే. మరి ఇతరులు.. పార్టీ సామాన్యుల పరిస్థితి పార్టీలో ఏమిటనేది చర్చ జరగాల్సి ఉంది. ఏ విషయమైనా కేసీఆర్‌కు అభిప్రాయం చెబుతుంటా. లేఖ రాస్తుంటా. అయితే నేను రాసిన లేఖ బయటకు రావడం అనేది బాధాకరం' అని కవిత వివరించారు.
'ఈ లేఖను చూసి కాంగ్రెస్, బీజేపీలు సంబరపడుతున్నాయి. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు బీఆర్‌ఎస్ పార్టీ ఆగమైంది.. కేసీఆర్‌కు ఏమైందో అని అనుకుంటున్నాయి. తెలంగాణకు నాయకుడు కేసీఆర్. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడతది. తెలంగాణ ముందుకు వెళ్తుందని నేను బలంగా నమ్ముతున్నా.
పార్టీలో ఉన్నటువవంటి చిన్న చిన్న లోపాలను చర్చించుకుని.. సవరించుకుని కోవర్టులను పక్కకు జరుపుకుంటూ ముందుకువెళ్తే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుందని నా భావన. బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. రెండూ పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేశాయి. ఆ రెండూ పార్టీలకు కూడా ప్రత్యామ్నాయం కేసీఆర్ నాయకత్వం' అని కవిత ప్రకటించారు.
Also Read: KCR Probe: విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా? కాళేశ్వరం ప్రాజెక్టు సందేహాలను నివృత్తి చేస్తారా?
బీఆర్‌ఎస్ పార్టీ దూరం
విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని వస్తున్న ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ పార్టీ దూరంగా ఉంది. ఆమె మద్దతుదారులు, తెలంగాణ జాగృతి శ్రేణులు మాత్రమే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. 'సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవితకు స్వాగతం, సుస్వాగతం' అంటూ ప్లకార్డులు, బ్యానర్లు కనిపించాయి. ఎక్కడా బీఆర్‌ఎస్ పార్టీ పేరు, కేసీఆర్, కేటీఆర్ ఇలా ముఖ్య నాయకుల ఫొటోలు కనిపించలేదు. టీమ్ కవితక్కా అంటూ ప్రత్యేకంగా ప్లకార్డులు దర్శనమివడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









