K Kavitha: 'వక్ఫ్‌ బిల్లుపై పార్లమెంట్‌ నుంచి రాహుల్‌, ప్రియాంక గాంధీ పారిపోయారు'

K Kavitha: They Are Not Gandhi Siblings Is Election Gandhis: దేశానికి సంబంధించిన కీలకమైన బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంటే రాహుల్‌, ప్రియాంక గాంధీలు పారిపోయారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ అని ఆరోపించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 5, 2025, 03:22 PM IST
K Kavitha: 'వక్ఫ్‌ బిల్లుపై పార్లమెంట్‌ నుంచి రాహుల్‌, ప్రియాంక గాంధీ పారిపోయారు'

Waqf Act Amendment Bill 2025: పార్లమెంట్‌ సమావేశాల్లో వక్ఫ్‌ బోర్డు సవరణ చట్ట బిల్లు -2025పై చర్చలో జరగకుండా రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు పారిపోయారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ కనబరుస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణంగా పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source

Also Read: Construction Works: రియల్‌ ఎస్టేట్‌ రంగానికి భారీ షాక్‌.. రేపటి నుంచి హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణాలు బంద్‌?

ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరుకాకపోవడం అత్యంత దారుణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. భారతదేశంలోని కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన అంశంలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల సమయంలోనే వీళ్లకు మైనారిటీలు గుర్తొస్తారా? అని నిలదీశారు. దేశంలోని మైనారిటీలను కాపాడుతామని ప్రగల్బాలు పలికే రాహుల్ గాంధీ వక్ఫ్ బిల్లుపై చర్చలో ఎందుకు మాట్లాడలేదో సమాధానం చెప్పాలని కవిత సవాల్‌ చేశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ, మైనారిటీల హక్కులను కాలరాసే వాక్ఫ్ చట్ట సవరణ బిల్లు పై ఎందుకు మాట్లాడలేదన్నారు. 'ఇది ముస్లింలను నట్టేట ముంచడం కాదా? టోపీలు పెట్టుకొని ఓట్లు దండుకోవడమే వీళ్ల నైజం. మైనారిటీలకు అండగా ఉండాల్సిన సమయంలో వెన్ను చూపించారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

Also Read: Shobha Yatra: శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీస్‌ నిఘా.. అసాధారణ రీతిలో పకడ్బందీ బందోబస్తు

మరో వైపు మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం అసెంబ్లీలో స్థాపించాలని ఎమ్మెల్సీ కవిత మరోసారి డిమాండ్‌ చేశారు. ఇప్పటికే స్పీకర్‌, ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని.. దీనికి నిరసనగా ఈనెల 8వ తేదీన ఇందిరా పార్క్‌లో ధర్నా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జ్యోతిబాపూలే విగ్రహ సాధన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో బీసీల కోసం ఎన్నో పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని అమలు చేసేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిద్రపోనివ్వని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News