Kalvakuntla Kavitha: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సరికొత్త నిర్వచనం ఇచ్చారు. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని.. అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని తెలిపారు. 'అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోంది. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్' అని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
Also Read: Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సిందిపోయి.. పెంచుతారా?: కేటీఆర్ ఆగ్రహం
అసెంబ్లీలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటుచేయాలనే డిమాండ్‌తో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద పూలే యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ జాగృతి సంయుక్తం నిర్వహించిన దీక్షలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఏప్రిల్ 11వ తేదీలోగా జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కుల గణన, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.
Also Read: KT Rama Rao: 'తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ఫుల్ పార్టీలు బీఆర్‌ఎస్.. టీడీపీ మాత్రమే'
'2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదు. తెలంగాణలో చేసిన కులగణన వివరాలను వెల్లడించలేదు' అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది కాబట్టి ఆ పార్టీపై ఒత్తిడి చేయాలని సూచించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి తాము కూడా కలిసి వస్తామని కవిత ప్రకటించారు. కానీ కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయమని ఎద్దేవా చేశారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలు కూర్చుందామని కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు.
'చట్టసభలు బిల్లులు ఆమోదించి నాలుగు వారాలైంది. ప్రస్తుతం ఆ బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలి? గవర్నర్ వద్దనే పెండింగ్‌లో ఉన్నాయా... లేదా రాష్ట్రపతికి పంపించారా?' అని రేవంత్ రెడ్డిని కవిత ప్రశ్నించారు. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదు. బీజేపీతో రేవంత్ రెడ్డికి లాలూచి లేకుంటే ప్రధాని అపాయింట్‌మెంట్ లభించేది' అని ఆరోపించారు. బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదని తెలిపారు.
'ఢిల్లీలో తుఫేల్ ధర్నా చేశారు. ధర్నాకు రాహుల్ గాంధీ వస్తారని ఊదరగొట్టారు కానీ చివరికి రాలేదు' అని కవిత గుర్తుచేశారు. కులగణన అధ్యయనం పూర్తి చేసే వరకు మనం మాట్లాడవద్దని స్వతంత్ర అధ్యయన సంస్థ హెచ్చరిక చెబుతోంది. మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి?' అని కవిత ప్రశ్నించారు. చిత్తశద్ధి ఉంటే కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టాలని కవిత ఛాలెంజ్ చేశారు.
దేశంలో తరతరాలుగా వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని కాంక్షించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే సమాజం స్పూర్తి పొందుతుందని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ధైర్యంగా ముందుకే వెళ్తాము తప్పా... వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రిజర్వేషన్ల పెంపునకు మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసి సాధించాం. ఇది తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీఆర్ఎస్ పార్టీ విజయం' అని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









