Telangana New CS: తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణా రావు..!

Telangana New CS: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువైనప్పటి నుంచి శాంతి కుమారి .. ప్రధాన కార్యర్శిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఆమె పదవీ కాలం ముగియనుండటంతో సీనియారిటీ ప్రకారం మరొకరిని ఎన్నుకోనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 18, 2025, 10:07 AM IST
Telangana New CS: తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణా రావు..!

Telangana New CS:  తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. 1989 బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత సీఎస్‌ శాంతికుమారి 2021 జనవరి నుంచి సీఎస్‌గా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ హాయాం నుంచి రేవంత్ రెడ్డి వరకు ఈమెనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో ఎక్కడా గొడవలు లేకుండా ప్రభుత్వాన్ని సజావుగా నడిపించడంలో శాంతి కుమారి కీలక పాత్ర పోషించారు.

తాజాగా ఈమె పదవీ కాలం  వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎస్‌గా రామకృష్ణారావు పేరును ప్రభుత్వం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.సీనియారిటీ ప్రకారం ఆయన్నే నియమించే అవకాశం ఉంది.

1991 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామకృష్ణారావు పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది. త్వరలో పదవీ కాలం ముగయనున్న ఈయన్ని ప్రధాన కార్యదర్శిగా నియమించి మరో రెండేళ్లు ఆయన పదవీ కాలం పొడిగిస్తారా లేదా అనేది చూడాలి.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News