KCR Kaleshwaram: తెలంగాణకు వరప్రదాయినిగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈ కమిషన్ ముందు 118వ సాక్షిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో విచారణకు హాజరవగా.. కమిషన్ కీలక ప్రశ్నలు వేసినట్లు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్‌కు 18 ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.
ప్రశ్నలు ఇలా..
కమిషన్: ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారు? మంత్రివర్గ ఆమోదం ఉందా?
కేసీఆర్: రీ ఇంజనీరింగ్ గురించి వివరించారు.కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగింది. వ్యాప్కోస్ సిఫారసుల ప్రకారం జరిగింది. అన్ని అనుమతులు తీసుకున్నాం. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలతో కూడిన పుస్తకాన్ని కమిషన్‌కు అందించారు. జీఓ 45, 2020తో కూడిన ఆపరేషన్ మెయింటనెన్స్‌పై మాజీ సీఎం కేసీఆర్ డాక్యుమెంట్స్ సమర్పించారు.
కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్ గురించి చెప్పండి.
కేసీఆర్: కొత్త రాష్ట్రంలో నిధుల అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వేగంగా పూర్తి చేసేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు.
కమిషన్: బ్యారేజీల్లో నీటి నిల్వ వివరాలు ఏమిటి?
కేసీఆర్: మళ్లించాల్సిన నీటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశం. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం చేపట్టాం.
కమిషన్: బ్యారేజీల లొకేషన్స్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారు?
కేసీఆర్: టెక్నికల్ నివేదికల ఆధారంగా బ్యారేజీల లొకేషన్స్ మార్పులు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతి అంశాన్ని మంత్రివర్గం అనుమతి ఉంది. ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన లేఖలు, సీడబ్ల్యూసీ లేఖలను కమిషన్ ముందుంచారు.
కేసీఆర్: తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర అంగీకరిచలేదు. మేడిగడ్డ వద్ద 230 టీఎంసీ నీళ్లను లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. మెయింటెనెన్స్ కోసం రూ.280 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్టుకు కావలసిన అన్ని సర్వేలు చేశాం. కేంద్రం నుంచి రావలసిన అన్ని అనుమతులు ప్రాజెక్టుకు వచ్చాయి.
Also Read: Telangana Investments: తెలంగాణకు పెట్టుబడుల జాతర.. రూ.2 వేల కోట్ల పెట్టుబడులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









