
Kaleshwaram Project Report: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల్లో అవినీతి, అక్రమాల్లో ప్రజాధనం భారీగా దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి జులై 31న నివేదిక సమర్పించింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పులు, అవకతవకలను కమిషన్ వెలుగులోకి తెచ్చింది. అనేక లోపాలు, అక్రమాలను గుర్తించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ (National Dam Safety Authority) NDSA కూడా దర్యాప్తు జరిపి మేడిగడ్డ బ్యారేజి వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, నాణ్యత తదితర కారణాలని పేర్కొంది.
ఈ అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని NDSA , న్యాయ విచారణ కమిషన్ రిపోర్టులు స్పష్టం చేశాయి. ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉన్నందున సీబీఐ దర్యాప్తు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ లేఖలో తెలిపింది.
సీబీఐ విచారణకు కేంద్ర హోం శాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తు మళ్లీ ప్రారంభం అవుతుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు, ఈ మొత్తం అంతిమంగా ఎవరికి, ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌పైన కూడా దర్యాప్తునకు సూచించింది. అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థలకు సైతం ఇదే సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అన్న ఆందోళన ఇంజినీర్లలో మొదలైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు లో వందల కోట్ల అవినీతి జరిగినట్లు , వారి కుటుంబానికే చెందిన MLC కవిత తెలిపిందని, కనుక ఆమెనే మొదట విచారించాలన్నారు BJP MP ధర్మపురి అర్వంద్ చెప్పుకొచ్చారు. కాళేశ్వరం అవినీతితో రానున్న తరాలను సైతం ముంచారని BRS నేతలపై మండిపడ్డారు. అవినీతి ఎప్పుడో జరిగితే రెండేళ్ళ తరువాత రేవంత్ సర్కార్ నిద్ర లేచిందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.