KalvaKuntla Kavitha: బీఆర్ఎస్ ఓటమికి కుట్రలు చేసింది ఆయనే..!. మరో బాంబు పేల్చిన కల్వకుంట్ల కవిత..

kalvakuntla Kavitha fires on harish rao: కొంత మంది ఇండిపెండెంట్ లు తన వద్దకు వచ్చి జూబ్లిహిల్స్ బై పోల్స్ వేళ ఎవరికి మద్దతు ఇవ్వాలొ అడిగారని దీనిపై తాను రియాక్ట్ కాలేదన్నారు. అంతే కాకుండా.. మాజీ మంత్రి హరీష్ రావు కుట్రలతోనే బీఆర్ఎస్ జూబ్లిహిల్స్ బై పోల్స్ లో ఓడిపోయిందన్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 15, 2025, 03:05 PM IST
  • హరీష్ రావు పై మండి పడ్డ కల్వకుంట్ల కవిత..
  • ఓటమిపై విమర్శలు..
KalvaKuntla Kavitha: బీఆర్ఎస్ ఓటమికి కుట్రలు చేసింది ఆయనే..!. మరో బాంబు పేల్చిన కల్వకుంట్ల కవిత..

kalva kuntla Kavitha fires on  harish rao: ఇటీవల జూబ్లిహిల్స్ బై పోల్స్ లో బీఆర్ ఓటమి చెందిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో దీనిపై కల్వకుంట్ల కవిత మరోసారి రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ ఎన్నికలపై కర్మ ఎవరిని వదలొదు అంటూ..  తన సోషల్ మీడియా అకౌంట్ లో కవిత ట్విట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. మరోసారి కల్వకుంట్ల కవిత  మెదక్ పర్యటనలో బీఆర్ఎస్ ఓటమికి మాజీ మంత్రి హరీష్ రావు కుట్రలు చేశారని సంచలన వ్యాఖ్యలుచేశారు.  జూబ్లిహిల్స్ బై పోల్స్ వేళ.. కొంత మంది ఇండిపెండెంట్ లు తన దగ్గరకు వచ్చి ఎవరికి మద్దతు ఇవ్వాలో అడిగారన్నారు.

Add Zee News as a Preferred Source

దీనికి తాను.. మీ ఇష్టమని వారికే వదిలేశానని చెప్పారు. అదే విధంగా.. వారంతా మరల హరీష్ రావును కలిసినా అదే మాట చెప్పారని తనకు తెలిసిందన్నారు. హరీష్ రావు పార్టీలో ఉంటూ.. బీఆర్ఎస్ ను మోసం చేశాడన్నారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదన్నారు మెదక్‌ జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్‌కు ఆవేదన వ్యక్తం చేశారు.  అదే విధంగా.. గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఫైర్ అయ్యారు.

మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు లతో సహా పలువురు బీఆర్ఎస్ (BRS) నాయకులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాను వదిలేసి ప్రజల్లోకి వెళ్లి వారి బాధలను, సమస్యల్ని తెలుసుకొవాలన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంను నమ్ముకుని ఈ రోజు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో ఓడిపోయిందన్నారు.

అదే విధంగా.. బీఆర్ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు గతంలో ఎలా ఉండేవారని.. ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించారని ఏకీపారేశారు.  బీఆర్ఎస్ నేతలు ఆస్తులు పెంచుకున్నారే కానీ... కేడర్‌ను మాత్రం పెంచుకోలేదని విమర్శలు  గుప్పించారు.  మరోవైపు.. హరీష్ రావు..రైతుల్ని కూడా బలిపశువును చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
 హరీశ్‌రావు ఫాంహౌజ్ ఆ సమీపంలో  రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ను మార్చారని  ఎద్దేవా చేశారు.

వీళ్లు చేసే అరాచకాల వల్లే బీఆర్ఎస్ కు ఈ గతి పట్టిందని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు  తప్పిదాల వల్ల.. కొల్చారం, పాపన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో భూములు బీడు బారిపోతున్నాయన్నారు. మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని,  మెదక్‌లో ఎలాంటి సౌకర్యాలు లేవని మెడికల్ సీట్లను సీఎం రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం కొడంగల్‌కు తీసుకెళ్లారన్నారు. 

Read more: CP Sajjanar: ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌కే ఊహించని ఝలక్.!. సీపీ సజ్జనార్ కీలక ప్రకటన.. ఏమన్నారంటే..?

కాళేశ్వరం ప్రాజెక్ట్ తో  మెదక్ జిల్లారైతులకు చుక్క నీరుకూడా లభించలేదన్నారు. హరీశ్‌‌రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎం రేవంత్‌రెడ్డికు సంబంధాలు ఉన్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ప్రశ్నించే శక్తిగా జాగృతి పనిచేస్తునే ఉంటుందని కల్వకుంట్ల కవిత తెల్చి చెప్పారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News