)
Kalvakuntla Kavitha fires on brs kcr party: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జూబ్లిహిల్స్ ఓటమి తర్వాత కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ను చీల్చి చెండాడేస్తున్నారు. రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కవిత బీఆర్ఎస్ ను, కేటీఆర్, హరీష్ రావులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తంగా ఎక్కడ చాన్స్ దొరికిన కూడా కవిత దుమ్మెత్తి పోస్తున్నారు. మొత్తంగా గత రెండు, మూడు రోజుల నుంచి పలు జిల్లాలలో పర్యటిస్తున్న కవిత ప్రస్తుతం ఖమ్మంలో జనంబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తనను ఏ విధంగా పార్టీ నుంచి బలవంతంగా కుట్రలు చేసి బైటకు పంపారన్నారు.
మరోవైపు తుమ్మల నాగేశ్వర రావు వంటి సీనియర్ నేతల్ని పార్టీ నుంచి పొగొట్టుకోవడం కూడా పార్టీ ఓటమికి ఒక కారణమన్నారు. అంతేకాకుండా తాను ఎంపీగా ఉన్నప్పుడు తనను జిల్లా దాటి ఎక్కడకు వెళ్లకుండా, ఏపనిచేయకుండా కట్టేశారన్నారు. రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించటంలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు.బీఆర్ఎస్లో జాగృతి కార్యకర్తలకు అన్యాయం చేశారని... కనీస గుర్తింపు ఇవ్వలేదని కవిత సంచలన కామెంట్స్ చేశారు.
అదే విధంగా ప్రస్తుతం తాను తెలంగాణ ప్రజల గొంతుక విన్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్ని కూడా పర్యటిస్తున్నట్లు చెప్పారు. ఒక వేళ కొత్త పార్టీ పెడితే.. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి ఢంకా బజాయించి.. తెలంగాణ ప్రజలకు వజ్రాయుధంలాంటి పార్టీని ఇస్తామన్నారు. ప్రజలకోసం పోరాటే పార్టీని ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా పార్టీ పెట్టకుండా కూడా బోలేడంతా రాజకీయాలు చేయోచ్చన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలో 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నట్లు చెప్పారు.
తనపై కుట్రలు చేసిన వారి గురించి పక్కా మాట్లాడతానని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోరని, తన కుటుంబం నుంచి తనను విడదీసిన వారిని వదలనన్నారు. నా దగ్గర అన్ని ప్రూఫ్ లు ఉన్నాయని, అందుకే మాట్లాడుతున్నానని చెప్పారు. తుమ్మల నాగేశ్వర రావు గారు వెళ్లిన తర్వాత.. తెలంగానలో ఒక గందరగోళ వాతావరణం ఏర్పడిందన్నారు. అందుకే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతు వస్తుందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి