)
kavitha mass warning to brs former minister Niranjan reddy: కల్వకుంట్ల కవిత ఇటీవల ఎక్కడ అవకాశం దొరికిన కూడా అధికార కాంగ్రెస్, అపోషిషన్ బీఆర్ఎస్ పార్టీలను ఏకీపారేస్తున్నారు. ముఖ్యంగా జనం బాట కార్యక్రమంను నిర్వహిస్తు ప్రజల్లోకి వెళ్లి వారి బాధల్ని వింటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హమీలపై కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలపై కూడా తీవ్రస్థాయిలో వారు చేసిన అక్రమాలపై ఏకీపారేస్తున్నారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
'జాగృతి జనం బాట' కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో మీడియాతో మాట్లాడిన కవిత.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు గుప్పించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన తండ్రి వయసు వారన్న గౌరవంతో ఇన్నాళ్లు ఒప్పిగ్గా అన్ని భరించానన్నారు. ఇక మీదట సహించేదిలేదన్నారు.
తనను ఉద్దేశించి "పుచ్చువంకాయ, సచ్చు వంకాయ" అంటూ అవమానకరంగా మాట్లాడిన వ్యాఖ్యలపై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మరోసారి ఇలా పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందంటూ ఘాటుగా హెచ్చరించారు. ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి మూడు ఫామ్‌హౌస్‌లు ఎలా కట్టుకున్నారని ఏకీపారేశారు. అసైన్డ్ భూములను ఆక్రమిస్తు, కృష్ణా నది కాలువ సైతం ఆయన ఫామ్‌హౌస్ నుంచే వెళ్లేలా మళ్లించుకున్నారని ఆరోపణలు గుప్పించారు.
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతి వ్యవహారాలు కేసీఆర్ కు తెలియవా..?.. లేక హరీష్ రావు అడ్డుపడ్డాడా అంటూ నిలదీశారు. నిరంజన్ రెడ్డి అవినీతిపై వనపర్తిలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని, మీడియా ముఖంగా ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళుతున్నానని తెలిపారు.
అదే విధంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకొవడంలేదన్నారు. తనకు బీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధంలేదని,ఆ పార్టీలో ఉద్యమ కారులు ఉండలేక తీవ్రఇబ్బందులకు గురౌతున్నారన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook