)
Kalvakuntla Kavitha press meet hot comments on ktr: హరీష్ రావు, రేవంత్ ఒకే ఫ్లైట్ లో ఏరోజైతే ఒకే విమానంలో ప్రయాణించారో ఆ రోజు నుంచే తమ కుటుంబం విడగొట్టడానికి కుట్రలు మొదలయ్యాయని అన్నారు. పెన్షన్ లను పెంచాలని ఉద్యమాలు చేశానన్నారు. సీఎం జిల్లాలో భూ నిర్వాసితులకు అండగా నిలిచానన్నారు. పార్టీలో ఏంజరుగుతుందో చూసుకోవాలన్నారు.
పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. హరీష్ రావు పూర్తిగా రేవంత్ కు సరెండర్ అయిపోయడన్నారు. కేటీఆర్ మీద ఎన్నికేసులు పెట్టారు.. హరీష్ రావు మీద ఎన్ని కేసులు పెట్టారు.. అవన్ని ఒకటి రెండు రోజులు మాత్రమే హెడ్ లైన్ లో కన్పిస్తాయని ఆ తర్వాత.. ఎటు పోయాయని అన్నారు.
చెల్లిపై పార్టీ ఆఫీసులోనే కుట్రలు జరుగుతున్నాయని చెబితే ఏంచేశారని కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామన్న.. హరీష్ రావు, సంతన్న బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను మోసం చేస్తారని , వాళ్లను దూరం పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కవిత కోరారు. హరీష్ రావు ట్రబుల్ షుటర్ కాదు.. బబుల్ షూటర్.. సమస్యల్ని ఆయనే క్రియేట్ చేసి ఏదో సమస్య సాల్వ్ చేసినట్లు బిల్డప్ ఇస్తాడని కవిత హరిష్ రావును తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దుబ్బాక, హుజురాబాద్ లో ఓటమికి కారణం హరీష్ రావుదే అన్నారు.
హరీష్ రావును ఏదో ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్విట్ చేస్తున్నారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. మరోవైపు సంతోష్ కుమార్.. చెప్పులో రాయి.. చెప్పులో జోరిగలా మారాడన్నారు. ఆయనకు ధనదాహం ఎక్కువ అంటూ ఏకీపారేశారు. అంతేకాకుండా.. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తు మండలి చైర్మన్ కు లేఖల్ని విడుదల చేశారు.
తన 25 ఏళ్ల జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేశానన్నారు. వాళ్లు మేకవన్నెపులులు అంటూ హరీష్ రావు, సంతోష్ లపై మండిపడ్డారు. కలికాలం కాబట్టి వారి మాటలు నడుస్తున్నాయని, కానీ తాను కర్మ సిద్దాంతం ను నమ్ముతున్నానని అన్నారు.
నిజాయితీ ఎప్పటికైన గెలుస్తుందని కవిత ఎమోషనల్ అయ్యారు. అదే విధంగా తనకు పదవులు నాకు ముఖ్యం కాదని అన్నారు. పార్టీలో నా కాంట్రీబ్యూషన్ లేదా..హరీష్ లు, సంతోష్ లదే బాధ్యతనా అంటూ ఫైర్ అయ్యారు. అదే విధంగా కొన్నిసార్లు చిన్నవాళ్లదే నడుస్తుందని అన్నారు. కానీ కేసీఆర్ ఆదేశాల్ని పాటిస్తానని అన్నారు. కానీ కనీసం వివరణ కూడా తీసుకోలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.