)
Kalvakuntla kavitha satirical tweet on brs party: గత కొన్ని నెలలుగా దేశంలోనే జూబ్లిహిల్స్ బైపోల్స్ హాట్ టాపిక్ గా మారాయి. అన్ని ప్రధాన పార్టీలు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్నిఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైన జూబ్లిహిల్స్ పై తమ పార్టీ జెండా ఎగరవేయాలని అన్ని ప్రధాన పార్టీలు కాళ్లకు బలపం కట్టుకుని మరీ ప్రచారంను నిర్వహించాయి. మొత్తంగా ఎట్టకేలకు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల కౌంటింగ్ ఈరోజు జరిగింది. ప్రజలు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపించారు.
ముఖ్యంగా ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తనదైన చాణక్యంతో ముందుకు వెళ్లి నవీన్ యాదవ్ ను గెలిపించుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం చవిచూసింది. మొత్తంగా ఈ ఉపఎన్నికల్లో.. నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా... బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటాకు 924 మంది ఓటు వేశారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.
2014 నుండి 2023 వరకు జరిగిన 7 ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఓడిపోయిందన్నారు. కానీ తాము.. 2 ఓడిపోయి 5 ఉప ఎన్నికల్లో గెలిచామన్నారు.అదే విధంగా.. తమ సోషల్ మీడియా వారియర్ల కృషికి నేనేం ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేమన్నారు. ఈ ఎన్నిక ఫలితాలతో కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయ్యామన్నారు. ఇదే స్పూర్తితో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుదామన్నారు.
ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కు గురైన కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కు ఇన్ డైరెక్ట్ గా చురకలు పెట్టారు. గతంలో పార్టీ కోసం ఎంతో కష్డపడ్డానని, ఇంటి ఆడబిడ్డనైన తనను కనీసం కారణం కూడా చెప్పకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కల్వకుంట్ల కవత పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి కేసీఆర్ మినహా.. మిగత పార్టీకి చెందిన కేటీఆర్,హరీష్ రావుతో సహా మిగత నేతల్ని చాన్స్ దొరికినప్పుడల్లా కవిత ఏకీపారేస్తు వస్తున్నారు. అయితే.. తాజాగా.. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కల్వకుంట్ల కవిత ఎక్స్ లో సంచలన ట్విట్ చేశారు.
కర్మ ఈజ్ బ్యాక్ అంటూ .. కర్మ ఎవర్ని వదలొదు.. ఆలస్యమైన చేసిన తప్పుకు అనుభవించాల్సిందే అంటూ అర్థం వచ్చేలా సెటైరికల్ ట్విట్ చేశారు. తనను అవమానించి పార్టీలో నుంచి పంపించినందుకు.. ఈ విధంగా అనుభవిస్తున్నారని అర్థం వచ్చే విధంగా కవిత ఇన్ డైరెక్ట్ గా సెటైరికల్ ట్విట్ చేశారని సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కవిత సెటైరికల్ ట్విట్.. బీఆర్ఎస్ కు ములిగే నక్క మీద తాటికాయ పడినట్లయ్యిందని కొంత మంది సెటైర్ లు వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి