)
Kamareddy Flood Snake Video: ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా పూర్తిగా నిండిపోయిన సంగతి తెలిసిందే. దారుణంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చి, జనజీవనం స్తంభించిపోయింది. దీంతో జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. చుట్టూ నీళ్లు నిండిన సమయంలో పశు, పక్షాదులు ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో నీళ్లు లేని ప్రదేశాలను వాటి ఆవాసాలుగా ఎంచుకుంటున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఓ బ్రిడ్జిపైకి నాగుపాము వచ్చింది.
చుట్టూ నీరు ఉండగా.. బ్రిడ్జి పైన ఆవాసం చేసుకునేందుకు వచ్చింది. అటుగా వచ్చిన ప్రజలు దాన్ని గమనించగా.. పడగ విప్పి బుసలు కొడుతుంది ఆ నాగుపాము. ప్రజలంతా దాని వంక ఆసక్తిగా చూస్తూ.. మొబైల్ లో వీడియో రికార్డింగ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మరోవైపు భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలం అయ్యింది. జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అతిభారీ వర్షం ప్రజలను వణికించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సముద్రాన్ని తలపించాయి. వాగులు, వంకలు నీటి వరదతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఇప్పటికీ ఆ జిల్లాలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. వరదల్లో కార్లు, మనుషులతో పాటు మూగజీవులు కూడా కొట్టుకుపోయాయి. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇప్పుడు కామారెడ్డిలోని ఓ వంతెనపై నాగుపాము పడగవిప్పి ఉన్న వీడియో తెగ వైరల్ అవుతోంది. చుట్టూ ఉధృతిగా నీరు ప్రవహిస్తున్నా.. క్రమంలో ఎటు పోయే వీలు లేక పడగ విప్పి నిల్చుంది ఆ నాగుపాము. చాలా సేపు అదే వంతెనపై ఉంది. అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు ఆ పామును వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త తెగ వైరల్ అయ్యింది. వీడియో చూసిన చాలా మంది అనేక రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ పాము గురించి ఆందోళన చెందగా.. మరికొందరు స్థానికులకు రక్షణ ఎలా అంటూ బాధ పడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook