K Chandrashekar Rao: కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రపూరితంగా.. రాజకీయ కక్షతో కేసీఆర్, హరీశ్ రావుపై సీబీఐ విచారణకు ఆదేశించడంపై బీఆర్‌ఎస్ పార్టీ భగ్గుమంది. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. కరీంనగర్‌లో సోమవారం కాళేశ్వరం జలాలతో అమరవీరుల స్తూపాన్ని అభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు కీలక ప్రసంగం చేశారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పాలనను ఆపేసి ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టి, ప్రజల సంక్షేమం కోసం పని చేయాలి. కక్షపూరిత రాజకీయాలతో ప్రజలకు మేలు జరగదు' అని తెలిపారు.
Also Read: Harish Rao: రేవంత్, భట్టికి దమ్ముందా? నేను రాజీనామా చేస్తా: హరీశ్ రావు
కరీంనగర్‌లోని లోయర్ మానేరు నది నుంచి కాలేశ్వరం జలాలను సేకరించి అమరవీరుల స్థూపానికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జై కేసీఆర్ జై జై కేసీఆర్.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పున్నమ్మ అనిల్ కుమార్ మాట్లాడారు. 'కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని. తెలంగాణ ప్రజల రైతాంగానికి అన్నపూర్ణగా నిలిచింది. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ పేరును అప్రతిష్టపాలు చేసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇలాంటి చర్యల ద్వారా తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి' అని వారు తెలిపారు. ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను ఆపి.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా కృషి చేయాలని నారదాసు లక్ష్మణరావు, పున్నమ్మ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.
Also Read: KTR: అసెంబ్లీలో కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి కుట్ర.. మరో భారీ ఉద్యమం చేస్తాం
అన్ని జిల్లాల్లో..
కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతోపాటు తెలంగాణవాదులు, ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. రహదారులపై రాస్తారోకో, ధర్నాలు చేస్తూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.
Also Read: Employees Holiday: ఉద్యోగులకు సెలవులే సెలవులు.. సెప్టెంబర్‌లో మొత్తం 8 రోజులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









